ఫైబర్‌నెట్ చుట్టూ ఏపీ రాజకీయం..410 మంది ఔట్
జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సి వస్తుందని చైర్మన్ చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల స్వరూపం మారిపోయింది. కేసుల పర్వం తెరపైకొచ్చింది. ఒక్కో అంశాన్ని తెరపైకి తేవడం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా కేసులు మొన్నటి వరకు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల పర్వం కొనసాగుతున్నా.. తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇది వరకే వ్యూహం సినిమా యూనిట్‌కు, ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 2.15 కోట్లు జరిగాయని ఆ సంస్థ ఎండీ జీవి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు పోందిన వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.