ఏపీకి రైల్వే రిక్రూట్మెంట్ అవసరం: తిరుపతి ఎంపీ

సీనియర్ సిటిజన్లను గౌరవించడం మంచి లక్షణం. సమాజంలో లాభాపేక్షలేని సేవలు అందిస్తున్న అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా మేలు చేయాల్సిన అవసరాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రైల్వే రిక్రూట్మెంట్ జోన్ అవసరం అని ఆయన అంటున్నారు.

Update: 2024-07-31 15:04 GMT

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు విశాఖపట్నం కేంద్రంగా "సౌత్ కోస్ట్ రైల్వే జోన్" ఏర్పాటుకు చేయాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి డిమాండ్ చేశారు. దేశంలో 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి. సికింద్రాబాద్ వెళ్లే పని లేకుండా, ఏ.పీలో రిక్రూట్మెంట్  బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 2024 -25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక రైల్వే ప్రాజెక్టులపై ఆయన తన గళం వినిపించారు.

దేశంలో ప్రజాప్రతినిధులతో సమానంగా సేవలు అందిస్తున్న అక్రిడెటెడ్ జర్నలిస్టుల రాయితీలు పునరుద్ధరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సీనియర్ సిటిజన్లను గౌరవిస్తూ, వారికి కూడా గతంలో ఉన్న సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రికి విన్నవించారు.
కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు అవసరం
ఆంధ్రప్రదేశ్ రైతాంగం 12 శాతం పండ్ల ఉత్పత్తుల్లో దేశంలోనే రెండవ స్ధానంలో ఉంది అని ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకుని వచ్చారు. మామిడి, అరటి, సిట్రస్, బొప్పాయి, జామ, సపోట సాగులో ప్రసిద్ధి చెందిందన్నారు. విజయనగరంలో కిసాన్ రైలు సేవలు అందించేందుకు ప్రధాన లోడింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయం. లోడింగ్, అన్లోడింగ్ పాయింట్లు విజయనగరం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరుతో పాటు ప్రధాన స్టేషన్లలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని కోరారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా రద్దు చేసిన
స్టాపింగ్ ఇవ్వండి

మారుమూల ప్రాంతాలలో పేద ప్రజలు ఆధారపడే ఏకైక రవాణా మార్గం రైల్వే. కోవిడ్ సమయంలో చాలా రైల్వే స్లాపంగ్లు తీసివేశారు. లాభదాయకం కాదంటూ చాలా స్టాపింగులు పతీసివేయబడ్డాయి మరియు ఇప్పుడు నిర్వహణ లాభదాయకతను పేర్కొంటూ చాలా స్టాప్‌లు పునరుద్ధరించబడలేదని ఈ విషయంలో, లాభదాయకతతో పాటు సామాజిక బాధ్యతతో గుర్తించి కోవిడ్ కి ముందు సమయాల్లో ఉన్న రైల్వే స్టాప్‌లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్లలో దారుణంగా ఉంటున్నాయి. వాటిని మెరుగుపరచాలని, అదనంగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌, వెండోడు రైల్వే స్టేషన్లో కృష్ణా, పూరీ ఎక్స్‌ప్రెస్‌లు ఆపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. నందలూరు లోకోషెడ్‌ మెరుగుపరచడంతోపాటు రాజంపేట, కోడూరు, ఓబులవారిపల్లి, నందలూరు స్టేషన్లలో కోవిడ్‌కు ముందు ఉన్న అన్ని స్టాపింగులు పునరుద్ధరించాలని ఆయన ఆభ్యర్థించారు.


ప్రతిధ్వనించిన "తిరుపతి" సమస్యలు
రేణిగుంట రైల్వేస్టేషన్‌ సామర్థ్యం పెంచడానికి రూ. 200 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశారు. ఆ పనులు త్వరగా చేపట్టాలని కోరారు. ఇప్పటికే మంజూరైన కడప- బెంగుళూరు లైన్ అభివృద్ధి వేగవంతం చేయాలని ఆయన కోరారు.
"ఇది కడప, పులివెందుల ముదిగుబ్బ మీదుగా వెళ్లే ప్రాజెక్టు" అని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి కలల స్వప్నం తిరుపతి- మదనపల్లె- బెంగళూరు రైల్వేలైన్. దీనిని రద్దు చేసి, పులివెందుల మీదుగా రైల్వేలైన్ కోసం కడప
ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి గతంలోనే రైల్వే మంత్రికి ఓ లేఖ ఇవ్వడం గమనార్హం.
"గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి నిధులు సాధించినా, పనులు చేపట్టడంలో ఆలస్యం చేస్తున్నారు" అని ఎంపీ గురుమూర్తి ఆవేదన చెందారు.
ఆలయాల పర్యాటకాన్ని ప్రోత్సహించండి
ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, తిరుపతి- అయోధ్య, వారణాసిని అనుసంధానం చేస్తూ, ప్రత్యేక రైలు సర్వీసు ప్రవేశ పెట్టాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. తిరుపతి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేస్తున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పీలేరు సమీపంలోని కలికిరి స్టేషన్ కూడా చేర్చాలని అభ్యర్థించారు. రేణిగుంట-గూడూరు మధ్య మూడోలైన్‌ పనులు త్వరగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి నుంచి మైసూరు వరకు వందేభారత్ రైలు ఏర్పాటుతో పాటు, తిరుపతి నుంచి షిర్డీకి డైలీ సర్వీస్ నడపాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి షిర్డీ వెళ్లే యాత్రకుల సంఖ్య గణనీయంగా ఉంటుందని గుర్తు చేస్తూ, ప్రజల కోరికను నెరవేర్చాలని ఆయన కోరారు.
తిరుపతి ప్రాంతానికి రూ. వందల కోట్ల నిధులు సాధించడం సంతృప్తి ఇచ్చిందని ఎంపీ మద్దెల గురుమూర్తి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. "గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లో నిమ్మకాయల దిగుబడి అధికం. ఇక్కడ లోడింగ్ పాయింట్లలో కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ అవసరం" అని ప్రత్యేకంగా కేంద్రానికి విన్నవించానన్నారు. 741 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం, ఆధునీకరణకు రికార్డు స్థాయిలో రూ.17 వేల కోట్లు సాధించానని ఆయన తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకు నిధులేకాదు. వాటిని త్వరగా పూర్తి చేయడానికి కూడా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:    

Similar News