ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయ్..

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ తొలి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

Update: 2024-06-26 11:45 GMT

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ తొలి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను పొందవచ్చని వివరించారు. ఈ ఫలితాల్లో జనరల్ కేటగిరి, ఒకేషనరల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ , https://resultsbie.ap.gov.in/ సైట్‌లను పరిశీలించొచ్చు.

ఏపీలో సప్లిమెంటరీ పరీక్షలు రాసిన వారిలో జనరల్ క్యాటగిరీ విద్యార్థులు 80 శాతం మంది, ఒకేషనల్ క్యాటగిరీ వారు 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ అయిన విద్యార్థుల మెమోలను ఒకటో తేదీ నుంచి వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అధికశాతం మంది ఇంప్రూవ్ మెంట్ కోసం రాసిన వారున్నారని అధికారులు వివరించారు.

Tags:    

Similar News