పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు.. ప్రకటించిన మాజీ జడ్జి

పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ న్యాయమూర్తి ఎస్ రామకృష్ణ హైకోర్టు ఆశ్రయించారు.

Update: 2024-06-17 11:07 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా 12 మందిపై మాజీ జడ్జి రామకృష్ణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు తగిన రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కావున తనకు రక్షణ కల్పించాలని రామకృష్ణ కోరారు. తన పిటిషన్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్ే ద్వారకానాథరెడ్డి సహా 12 మంది పేర్లను మాజీ జడ్జీ రామకృష్ణలో పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘నన్ను ఎంతో వేధించారు’

‘‘వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి బట్టబయలు చేసినందుకు నన్ను ఎంతో వేధించారు. పెద్దిరెడ్డి, ఆయన సోదరులు, అనుచరులు రాత్రింబవళ్లు వేధింపులకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని మా ఇంటిపై దాడి కూడా చేశారు. పోయిన అంటే మే 27న ఫోర్జరీ సంతకాలతో ఒకరు తనపై తప్పుడు ఫర్యాదు కూడా చేశారు. దాని ఆధారంగా నాపై కేసు కూడా నమోదైంది. నాపై నమోదు చేసింది తప్పుడు కేసంటూ సీఎస్ సహా ఎస్పీని ఆశ్రయించినా వారు పట్టించుకోలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారాయన.

అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలి..

తన ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన పిటిషన్‌ను అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని రామకృష్ణ.. హైకోర్టును కోరారు. హైకోర్టు తన పిటిషన్ పరిశీలించిన తర్వాత పెద్దిరెడ్డి, ఆయన సోదరులు సహా మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేసిందని చెప్పారు. అంతేకాకుండా తన రిట్ పిటిషన్‌పై విచారణ చేసి నివేదిక అందించాలని అన్నమయ్యజిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. కాగా ఈ నోటీసులపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా స్పందించలేదు.

పిటిషన్ ఇప్పుడు వేయడం అందుకేనా..

అయితే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న రామకృష్ణ.. ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించి తనకు రక్షణ కావాలని కోరడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీ పాలన కావడంతో భయబ్రాంతులకు గురయ్యి ఆయన కోర్టును ఆశ్రయించలేదని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కావడంతో మరోసారి తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తారని కొందరు ఆయనకు మద్దతు పలుకున్నారు. మరికొందరు మాత్రం.. వైసీపీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీనే ప్రతి వైసీపీ నేతను టార్గెట్‌గా చేసుకుని వేరువేరు తప్పుడు కేసులు పెట్టిస్తుందని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News