బాపట్లలో ఘోరం..నలుగురు స్పాట్‌ డెడ్‌

బాపట్ల ఎమ్మెల్యే నేరంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-11-03 04:04 GMT

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఆదివారం అర్థరాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కారు, లారీ ఢీకొట్టుకోవడంతో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. కారులో ప్రయాణిస్తున్న బేతాళం బలరామరాజు(65), బేతాళం లక్ష్మి(60), గాదిరాజు పుష్పవతి(60), ముదుచారి శ్రీనివాసరాజు(54)లు ప్రమాదం జరిగిన ఘటన స్థలంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురుకు మాత్రం గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరి బాలురును ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన మృతులు కర్లపాలెంకు చెందిన వాసులుగా గుర్తించారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News