ఏపీ గురుకులాల ఎంట్రన్స్‌ ఫలితాలు

ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు.;

Update: 2025-05-14 14:17 GMT

ఆంధ్రప్రదేశ గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ బుధవారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల సంస్థ ఏపీఆర్‌ఈఐఎస్‌ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ను అందుబాటులో ఉంచారు.

ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష అభినందనలు తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 7190 సీట్ల కోసం 73,993 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, వీరిలో 62,047 మంది ప్రవేశ పరీక్షలు రాశారు. ఏప్రిల్‌ 25 ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. https://aprs.apcffs.inవెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. విద్యార్థులు తమ తరగతులకు సంబంధించిన పేజీలను ఎంచుకోవాలి. ర్యాంకు రిజల్ట్‌పై క్లిక్‌ చేసిన తర్వాత విద్యార్థి తన ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ వంటి వివరాలను అందులో ఎంటర్‌ చేసిన తర్వాత ర్యాంకు కార్డులను పొందొచ్చు.
Tags:    

Similar News