అమరావతిలో పలు సంస్థలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

గతంలో భూములు కేటాయించిన ఆరు సంస్థలకు పలు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్;

Update: 2025-07-13 14:12 GMT

రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూములను కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం, గతంలో భూములు పొందిన కొన్ని సంస్థలకు ఝలక్ ఇచ్చింది.కొన్ని కేటాయింపులు, గతంలో చేసిన మరికొన్ని సంస్థల కేటాయింపులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భూములు పొందిన ఆరు సంస్థలకు పలు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో కొత్తగా ఏడు సంస్థలకు 32.40 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.అలాగే వివిధ సంస్థలకు ఏపీసీఆర్డీఏ భూములు కేటాయింపుపై 18వ మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 122 జారీని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇక గెయిల్‌కు 0.40, అంబికాకు ఎకరా భూమి కేటాయింపులను రద్దు చేసింది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.ప్రస్తుతం 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన పలు సంస్థలకు ఈ భూములు కేటాయించింది. జూన్ 23వ తేదీన జరిగిన సమావేశం అనంతరం మంత్రి వర్గ ఉప సంఘం రాజధానిలో భూములు కేటాయింపులు,పాతవాటి పరిశీలనలపై పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది.
Tags:    

Similar News