వైసీపీ వీడని పట్టు–సోమవారానికి శాసన మండలి వాయిదా

రెండో రోజు శాసన మండలిలో సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం పోటీగా నినాదాలు చేసుకున్నారు.

Update: 2025-09-19 09:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాలు సోమవారానికి వాయిదా వేశారు. రెండో రోజు శుక్రవారం కౌన్సిల్‌లో గందరగోళం నెలకొంది. సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే వాతావరణం కొనసాగుతుండటంతో అప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డా మండలిని ఛైర్మన్‌ మోషెన్‌ రాజు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మెడికల్‌ కళాశాలల అంశం మీద ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య వాదోప వాదాలు చోటు చేసుకున్నాయి. మండలి ప్రారంభమైనప్పటి నుంచి మెడికల్‌ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు.

ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలకు దిగారు. ఈ క్రమంలో ఛైర్మన్‌ మోషేన్‌రాజు పోడియం వద్దకు దూసుకుని వెళ్లారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేకరణ మీద చర్చ పెట్టాలని పట్టుబట్టారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. ప్లకార్లును ప్రదర్శిస్తూ చర్చ పరపాల్సిందేనని డిమాండ్‌కు దిగారు. ఆ మేరకు అంతకు ముందే వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్‌కు అందజేశారు. అయితే దానిని తిరస్కరించిన ఛైర్మన్‌ మండలి సజావుగా సాగేందుకు సహకరించాలని వైసీపీ సభ్యులను కోరారు. మైడికల్‌ కళాశాలల మీద స్వల్పకాలిక చర్చ జరపాలని తాము బీఏసీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. మరో వైసీపీ ప్రతిపక్ష వైసీపీ సభ్యులకు పోటీగా అధికార పక్ష సభ్యులు నినాదాలకు దిగారు.

దీంతో మండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది. అనంతరం జీఎస్టీ సంస్కరణల అంశం మీద స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఛైర్మన్‌ మోషేన్‌రాజు కోరారు. మండలని సజావుగా నడిపేందుకు ఆర్డర్‌లో ఉంచాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఛైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే ఆందోళనలను కొనసాగిస్తున్న వైసీపీ సభ్యులు దానిని తీవ్ర తరం చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రశ్నోత్తరాలు పూర్తి అయినట్లు ఛైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. అనంతరం మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణకు పాల్పడుతోందని కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా అంతకు ముందు ప్లకార్డులతో వైసీపీ ఎమ్మల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వైద్య కళాశాలలపై చర్చ పెట్టాలని మండలిలో ఆందోళనలకు దిగారు. దీంతో మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. అలా అప్పటికే రెండు సార్లు మండలిని వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా వైసీపీ సభ్యులు తమ పట్టును వీడక పోవడంతో మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.
Tags:    

Similar News