టీడీపీ కోటాలో మరో గవర్నర్ ..ఎవరంటే?

ఈసారి రాయలసీమ ప్రాంతం నుంచి సీనియర్ నేతను టీడీపీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.;

Update: 2025-07-16 14:17 GMT

ఎన్డీఏలో తెలుగుదేశం కీలక పాత్ర పోషిస్తున్న తరువాత కేంద్ర పదవుల విషయంలో ఆ పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కుతూనే వుంది.దక్కడం అనేకన్నా చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పి తమ వాటాను గట్టిగానే రాబట్టు కుంటున్నారు.కేంద్ర మంత్రి వర్గంలో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు వున్నారు.మిగతా పదవుల విషయంలోనూ తెలుగుదేశం పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం ముందుకు వస్తోంది.అందులో భాగంగానే తెలుగుదేశం సీనియర్ నేత ,మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది.ఇప్పుడు టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవి ఇవ్వడానికి రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది.ఢిల్లీ పర్యటనలో వున్న చంద్రబాబు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరిపిన చర్చలలో మరో గవర్నర్ పదవి తెలుగుదేశం కోటాలో ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో అదే చర్చ సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్ గా ఆషిమ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీంద్ర గుప్తాను కేంద్రం నియమించింది.అశోకగజపతి రాజు తరువాత ఇప్పుడు మరొకరికి అవకాశం వస్తోందని ,ఆ పేర్ల పైనా చర్చ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల పేరు వినిపిస్తున్నా, తనకు రాజ్యసభ సభ్యత్వం కావాలని ఆయన కోరుకుంటున్నారు.ఇప్పుడు టీడీపీ నుంచి గవర్నర్ గా మరొకరికి అవకాశం వస్తోంది కాబట్టి దానిని రాయలసీమ నేతకు కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ అవకాశం సీనియర్ నేత ,మాజీ మంత్రి కేఈ కృష్టమూర్తికి దక్కుతుందంటున్నారు.2014 నుంచి 2019 కాలంలో కేఈ ఉపముఖ్యమంత్రి గా కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు మంత్రిగా పనిచేసిన అనుభవం , అన్ని శాఖలపై అవగాహన వున్న నేతగా వున్నారు. పార్టీలోనూ మొదటి నుంచి కీలక భూమిక పోషిస్తున్నారు.
Tags:    

Similar News