పశువుల స్మగ్లింగ్ కి కళ్లెం పడేనా? కబేళాల ఆగడాలు ఆగేనా??

భారతదేశంలో ఎద్దులు, దున్నలు వంటి పశువులను కబేళాలకు స్మగ్లింగ్‌ చేయడాన్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా లాభం కనిపించడం లేదు.

Update: 2024-05-22 11:30 GMT

భారతదేశంలో ఎద్దులు, దున్నలు వంటి పశువులను కబేళాలకు స్మగ్లింగ్‌ చేయడాన్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా లాభం కనిపించడం లేదు. స్మగ్లింగ్ చేస్తున్నావారు అధికారుల కన్నా ఒకడుగు ముందే ఉంటూ తన వ్యాపారన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించినా ఫలితాలు మాత్రం మెరుగుపడట్లేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో జంతువుల స్మగ్లింగ్ జరుగుతోందని అధికారులే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్మగ్లింగ్ ఆంధ్ర, తెలంగాణలో అధికం అవుతోందని కొందరు అధికారులు అంటున్నారు. కానీ ఇక్కడి వారు మాత్రం అదేం లేదంటూ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.

ఆంధ్రలో పెరుగుతున్న జంతు స్మగ్లింగ్

ఆంధ్రలో జంతువుల స్మగ్లింగ్ పెరుగుతోందని, ప్రతి రోజు వందల సంఖ్యలో జంతువులు కబేళాలకు తరలుతున్నాయని అనేక మంది అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఓ జంతు ప్రేమికుడు మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యానో, ట్రక్కో, లారీనో జంతువులతో నిండి కనిపించినప్పుడు దాన్ని పట్టుకుంటారు. రెండు రోజులు పటిష్టంగా తనిఖీలుంటాయి. ఆ తర్వాత అంతా మామూలే. రాష్ట్రంలో జంతువుల స్మగ్లింగ్ ముమ్మరంగా జరుగుతోంది. వాటిని నియంత్రించాల్సిన నోడల్ ఆఫీసర్లలో కొందరు ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’’ అని చెప్పారు.

స్మగ్లింగ్ సమస్యే లేదు

ఈ ప్రచారంపై స్పందిస్తున్న వారు మాత్రం అసలు జంతువులను కబేళాలకు అనధికారికంగా తరలించడానికి ఆస్కారమే లేదని చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు నిర్వహించామని, ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీ చేస్తున్నామని అధికారులు వివరిస్తున్నారు. తమకు వాహనదారులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారాని చెప్పారు. స్మగ్లింగ్ చేస్తుంటే అది ఎవరైనా కిలోమీటర్ల దూరమైనా ఛేజ్ చేసి మరీ అదుపులోకి తీసుకుంటున్నామని, జంతు సంరక్షణకు తాము పెద్దపీట వేస్తున్నామని వివరిస్తున్నారు.

Tags:    

Similar News