‘స్కూళ్ళలో 'షుగర్ బోర్డులు' చాలవు, ఈట్ స్ట్రీట్ లూ రద్దు చేయాలి’

పిల్లలను కాపాడుకుందాం: ఆంధ్రప్రదేశ్ డాకర్ల, మేధావుల విజ్ఞప్తి;

Update: 2025-09-01 10:45 GMT
Image sourde: Dr Prashanti Gandhi

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ పిల్లల శారీరక సామర్థ్యాలను పెంచాలన్న స్పృహను కోల్పోయాయి   అంటూ 26 మంది   వైద్యుల, పిల్లల ప్రేమికుల, మేధావుల సంయుక్త ప్రకటన


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 21/8/25 నాడు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళన్నిటిలో’ షుగర్ బోర్డులు' పెట్టాలని ఒక ఆదేశాన్ని జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ CBSEబోర్డు 14/5/25న విడుదల చేసిన సర్క్యులర్ అమలులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బోర్డులు పెట్టేందుకు పూనుకుంటున్నారు.
పంచదార అధిక మోతాదులో వున్న జంక్ ఫుడ్స్ (అనారోగ్యకర ఆహారాలు) తినడం వల్ల పిల్లలలో ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరిగిన రీత్యా ఈ చర్య తీసుకున్నారు. పంచదార అధిక సేవనం వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి, ఆ మేరకు హెచ్చరికలు జారీ చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. (ఎందుకంటే ఇప్పటి వరకు కొవ్వు ఆహారాల వల్లే జీవన శైలి వ్యాధులు వస్తున్నట్లుగాను-కొవ్వులు తగ్గించడమే సమస్యకు పరిష్కారం అన్న తప్పుడు ప్రచారం తీవ్ర స్థాయిలో వుంది.) రోజువారీగా పిల్లలు తీసుకుంటున్న కేలరీలలో పంచదార నుండి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదన్నది వైద్య వర్గాల సూచన కాగా మన పిల్లలు తీసుకుంటున్న ఆహారంలోని కేలరీలలో 13 నుండి 15 శాతం (3 రెట్లు) ఉన్నట్లు గుర్తించారు.
ఈ అధిక పంచదార వినియోగం బాల్యంలోనే మన భావి భారత పౌరులను రోగ గ్రస్తులుగా చేసే దుస్థితి రావడం విచారకరం. 2010లోనే ఢిల్లీ హైకోర్టులో ఉదయ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ (NGO) ఒక ప్రజా ప్రయోజన వ్యాజాన్ని (PIL పిల్)దాఖలు చేసి జంక్ ఫుడ్స్ ను (అనారోగ్య కర ఆహారాలు) నిషేధించమని కోరడంతో ఈ చర్చ మొదలైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ (NCPCR), భారతీయ ఆహార సంరక్షణ ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI), జాతీయ పోషకాహార సంస్థ (NIN) వంటివి కోర్టు ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2015లో కోర్టు ఇచ్చిన తీర్పులో ఇందుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను రూపొందించమని పై సంస్థలను ఆదేశించింది. 2013లోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జంక్ ఫుడ్స్ అమ్మకాలను స్కూళ్ళలో నిషేధించమని అదే కోర్టు కోరింది. 2019లోనే తమిళనాడు ప్రభుత్వం చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచి ప్రైస్, ఫ్రైడ్ చిప్స్, సమోస,చోలా భటూర, గులాబ్ జాం, మిఠాయిలు, నూడిల్స్, కూల్ డ్రింక్స్(కోకాకోలా, పెప్సీ, వగైరాలు) ను స్కూళ్ళలో నిషేధించింది. స్కూల్ అసెంబ్లీలలో పిల్లలచేత జంక్ ఫుడ్స్ జోలికి పోకుండా ఉంటామని ప్రతిజ్ఞలు చేయించింది.
నిజానికి పంచదార దట్టించిన ఆహారాలు పిల్లలలో ఊబకాయం, మధుమేహాలనే గాక దంత క్షీణత, గుండె జబ్బులు, బి.పి., మతి మరుపు, మెదడు పనితనం దెబ్బతినడం, మానసిక కుంగుబాటు (డిప్రెషన్) వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు అనేక పరిశోధనల్లో నిర్ధారణ అయింది. అనారోగ్య సమస్యలతో పిల్లలు క్లాసు రూముల్లో అభ్యసనంపై శ్రద్ధ పెట్టలేక పోతున్నారు. మరోవైపు మన స్కూళ్ళన్నీ ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేసేలా ర్యాంకులు సాధించాలనే హడావిడి పెట్టి ఆటలనీ,వ్యాయామాలనీ వదిలివేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ పిల్లల శారీరక సామర్థ్యాలను పెంచాలన్న స్పృహను కోల్పోయాయి.
25/5/25 నాడు మన ప్రధాని మోడీగారు నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో షుగర్ బోర్డుల విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి 'ఫిట్ ఇండియా' (పటుత్వం/దేహదారుఢ్యం గల పౌరులతో కూడిన భారత్)ను నిర్మించాలని పిలుపు ఇచ్చారు.
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం', 'పొగ తాగడం ప్రమాదం' లాంటి హెచ్చరికలు చేస్తూనే సినిమాల్లో, టి.వి.లలో వాటిని మరింత ఎక్కువగా చూపుతున్నారు. 'షుగర్ బోర్డులు' కూడా ఇలాంటి మొక్కుబడి కార్యక్రమం కాకూడదు.
ఈ క్రింది చర్యలను చేపట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం .
- స్కూలు ఆవరణలోనూ,50 మీటర్ల దూరం వరకు వీటి అమ్మకం నిషేధిస్తేనే సరిపోదు. ప్రమాదకరమైన ఈ ఆహారాల తయారీనే కట్టడి చేయాలి/నిషేధించాలి.
-పోషకాహార అంశాల్ని స్కూల్ సిలబస్ లో భాగం చేయాలి. ఆహారం వండే/తయారు చేసే వర్కు షాపులు కనీసం వారానికొకటి పిల్లలచే చేయించాలి. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పోషకాహార పరిజ్ఞానం తప్పనిసరిగా అందించాలి.
- మన శరీరాలకు బయో క్లాక్ వుంది. హార్మోన్లు విడుదలయ్యే క్రమానికి అనుగుణంగా ఆహార వేళలు, నిద్ర వేళలు ఉండాల్సిన అవసరాన్ని చెప్పడమే గాదు, అమలుపరచాలి.
అర్ధరాత్రి వరకు 'ఈట్ స్ట్రీట్'లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. అక్కడ అమ్ముతున్న వాటిలో అత్యధికం అనారోగ్యకరమైనవే.
- స్కూలులో ఆటాడుకునే స్థలం తప్పనిసరిగా ఉండాలన్న నియమాన్ని అమలుపరచాలి. ఆటలకు, వ్యాయామానికి తగిన సమయం స్కూల్ టైమ్ టేబుల్లో కేటాయించాలి. వ్యాయామ విద్య చదువులో అంతర్భాగం కావాలి. దేహ దారుఢ్యంతో, మనో వికాసం ముడిపడి వుందన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్యులుగా,పిల్లల సమగ్ర అభివృద్ధి పట్ల శ్రద్ద వున్న వారిగా మేం ఈ విజ్ఞాపన చేస్తున్నాం. పై చర్యల అమలు కోసం పూనుకోవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు- ఆరోగ్యకర పిల్లలతో కూడిన దేశ నిర్మాణం కోరే వారంతా మాతో గొంతు కలపాలని కోరుతున్నాం.


ప్రకటన మీద సంతకం చేసిన వారు:

1. దా॥ కె. శంకర్ పూర్వ రిజిస్ట్రార్,

సంతకం చేసినవారు

NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ

2. డా॥ P.V. సత్యనారాయణ కార్డియో థొరాసిక్ సర్జన్,

LCHF డైట్ ప్రచారకులు, హైదరాబాద్,

3. డా॥ ఘంటా వెంకట్రావు

సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ. 4. డా॥ గోపాలం శివన్నారాయణ న్యూరాలజిస్టు, విజయవాడ.

రాష్ట్రవ్యాపిత మెడికల్ క్యాంపుల నిర్వాహకులు.

5. డా॥ దాసరి రామకృష్ణ ప్రసాద్

ప్రజా వైద్యులు, స్వచ్ఛ చల్లపల్లి నిర్వాహకులు.

6. డా॥ బి. రాజేశ్వరరావు

సూపరింటెండెంట్, పీపుల్స్ పాలీ క్లినిక్, నెల్లూరు.

7. డా॥ గుంటుపల్లి శ్రీనివాస్

అసోసియేట్ ప్రొఫెసర్, ఆశ్రం మెడికల్ కాలేజి, ఏలూరు.

8. డా॥ SVL. నారాయణరావు

నెఫ్రాలజిస్టు, నెల్లూరు.

9. డా॥ 7. దుర్గేష్

చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనంతపురం.

10. డా॥కె.రఘురాం

పల్మనాలజిస్ట్, విజయవాడ.

11. డా॥ బి. రామచంద్రారెడ్డి MS ఆర్థో సర్జన్, కడప.

12. డా॥ సురేష్ (అధ్యక్షులు) ప్రజా సైన్స్ వేదిక, తెలంగాణ. 13. డా॥ రాజేంద్ర ప్రసాద్ MS

జనరల్ సర్జన్, భద్రాచలం.

14. డా॥ S. సురేష్

దంత వైద్య ఆచార్యులు విజయవాడ.

15. డా॥ K. శివబాబు

ఫామిలీ ఫిజీషియన్, జహీరాబాద్,

16. డా॥ K. అశోక్

లోకార్చ్ స్కూల్ నిర్వాహకులు.

17. దా॥ K. దినకర్ పీడియాట్రిషియన్,

బాల భవిత కేంద్రం, ఆత్మకూరు.

18. పంతంగి రాంబాబు

సీనియర్ జర్నలిస్టు, రచయిత, హైదరాబాద్,

19. జి. మాల్యాద్రి

విశ్రాంత వయోజన విద్య ఉపసంచాలకులు

ఆరోగ్య విజ్ఞాన ప్రచురణల నిర్వాహకులు, నెల్లూరు.

20. ప్రత్యూష సుబ్బారావు సైకాలజిస్టు, గుంటూరు.

21. C.A. ప్రసాద్,

పిల్లల ప్రేమికుల

SCERT సలహా మండలి సభ్యులు, ఒంగోలు.

22. T.V. రామకృష్ణ

బాల సాహిత్యకారులు, నెల్లూరు.

23. విజయ కుమార్

రిటైర్డ్ డిప్యూటి ఎస్.పి., హైదరాబాద్.

24. V. రాహుల్టీ

IT నిపుణుడు, హైదరాబాద్.

25. ఇనేనాక మురళీధర్,

రచయిత, అనువాదకులు, హైదరాబాద్.

26. సాకం నాగరాజు

విశ్రాంత ప్రభుత్వ అధ్యాపకుడు, తిరుపతి,

Tags:    

Similar News