కూటమి సభ ఇవ్వనున్న సందేశం ఏమిటి?

టీడీపీ కూటమి సూపర్ 6 సక్సెస్ సభకు అనంతపురం సిద్ధం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-10 08:32 GMT

టీడీపీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభకు అనంతపురం సిద్ధమైంది. ఐక్యతతో పాటు బలం చాటడానికి అధికారంలోకి వచ్చిన తరువా మూడు పార్టీల నేతలు మొదటిసారి ఒకే వేదిక నుంచి ఎలాంటి సందేశం ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

అనంతపురంలో "సూపర్-6. సూపర్ హిట్" పేరిట నిర్వహంచే బహిరంగ సభ బుధవారం ప్రారంభం అవుతుంది. నగర శివారులోని 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం నారా చంద్రబాబు, జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడనున్నారు. ఈ సభ కోసం మంత్రులు నారా లోకేష్ సహా మిగతా వారందరూ అనంతపురం చేరుకున్నారు.
అనంతపురంలో బహిరంగ సభ సాంస్కృతిక కార్యాక్రమాలతో ప్రారంభమైంది. ఈ పాటికే సగం వంతు పార్టీ శ్రేణులతో నిండింది.
"టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత 15 నెలల కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం". అని గతంలోనే నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సభలో ఆయన 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..
రాయలసీమలో వైసీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా, అందులో ఏడు సీట్లు రాయలసీమలోనే దక్కాయి. ఈ పరిస్థితుల్లో కూటమి సాధించిన విజయాలు చెప్పే కూటమి పార్టీ రాష్ట్ర నేతలు ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశను నిర్దేస్తారు? అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక బిజెపి, జనసేన పార్టీలతో కలిసి మొదటిసారి అనంతపురంలోనిర్వహిస్తున్న బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఐదు లక్షల మంది కార్యకర్తలు హాజరుకారునట్లు అంచనా వేస్తున్నారు.

"టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చడం ద్వారా సామాజిక పింఛన్లు, ఇతర నగదు బదిలీ పథకాలతో పాటు సంక్షేమం కోసం 45 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం" అని ఈ పాటికే టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
"విజయోత్సవ సభ సవ్యంగా సాగడానికి అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం" అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం రాత్రి మీడియాకు చెప్పారు. అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రులతో కలిసి ఆమె సూపర్ సిక్స్ సభలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభతో పాటు నగరంలో దాదాపు ఆరు వెల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్ల హెంమంత్రి అనిత వెల్లడించారు.
మహానాడు ఇచ్చిన ఉత్సాహం

అనంతపురం వేదిక వద్ద  మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు

తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా కడపలోనే నిర్వహించి వైసిపికి గట్టి సవాల్ విసిరినట్లు అంచనా వేశారు. రాయలసీమ జిల్లాల్లో వైసిపికి మొదటి నుంచి ఆదరణ ఎక్కువ. గత ఎన్నికల్లో ఆ పార్టీ అంచనాలను టిడిపి కూటమి తలకిందులు చేసింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న టిడిపి కూటమి అనంతపురం జిల్లాలోని టిడిపి కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా రాయలసీమలో మరింత బలం చాటుకునేందుకు ఎత్తుగడ చేసినట్లు అంచనా వేస్తున్నారు.
సూపర్6 పథకాల అమలుపై వైసిపి తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపి కూటమిపై విమర్శలు సంధిస్తోంది. వీటిపై సీఎం ఎన్ చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర చీఫ్ వివిఎన్ మాధవ్ స్పష్టమైన సమాధానం చెప్పడానికి అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురంలో సభ ఏర్పాట్లు, వసతుల కల్పన కోసం రాష్ట్ర మంత్రుల బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పది రోజుల నుంచి మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ. భరత్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచ్చన్నాయుడు అధికారులు, పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేశారు.
"రాయలసీమలో కూటమి బలీయమైన శక్తిగా మారబోతోంది. కూటమి అందించిన పథకాలు ప్రజలకు చేరాయి. ఇదే మాకు మేలు చేస్తుంది" అని మంత్రి అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు.
అన్ని దారులు అనంతవైపు

రాయలసీమకు కేంద్రంగా ఉన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సభకు హాజరు కావడానికి టిడిపి, బిజెపి, జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు కూడా అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో కదిలాయి. నాయకుల సొంత వాహనాలతో పాటు కార్యకర్తల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.. అనంత సభకు హాజరు కావడానికి రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 3,857. ఆర్టీసీ బస్సులను కేటాయించారు. జిల్లాలోని నియోజకవర్గాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను తరలించే బాధ్యతలు తీసుకున్నారు.
అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభను కూటమి నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
"500 ఎకరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా బహిరంగ సభలో ఏర్పాటు చేశాం" అని సభ ఏర్పాటును మొదటి నుంచి సమీక్షిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
సీమపై ఫోకస్
2024 ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టిడిపి కూటమి మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో రాయలసీమపై టీడీపీ కూటమి ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. నాలుగు జిల్లాలు (చిత్తూరు, కడప, కర్నూలు) జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో 41 సీట్లు టిడిపికి బీజేపీకి రెండు, జనసేనకు రెండు సీట్లు దక్కాయి. అందులో అనంతపురం జిల్లాలో 14 సీట్లు టిడిపి దక్కించుకుంది. తద్వారా ఇక్కడ 100% స్ట్రైకింగ్ రేట్ సాధించింది. ఈ ఉత్సవాంతోనే టీడీపీ మొదటిసారి రాయలసీమలో ప్రధానంగా కడప జిల్లాలో అనేక సవాళ్ల మధ్య నిర్వహించింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనంతపురంలో సూరప్ సిక్స్ సక్సెస్ సభ నిర్వహించడం వెనుక కూడా బలమైన కారణం ఉన్నట్లే అంచనా వేస్తున్నారు. పార్టీ శ్రేణులను మరింత ఉత్సహ పరిచే దిశగా, మరింత బలంగా ప్రజల్లోకి పథకాలను తీసుకుని వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు సీఎం నారా చంద్రబాబు నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Tags:    

Similar News