వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇప్పటి వరకు ఫిర్యాదులు చేస్తూ వచ్చిన కూటమి వర్గాలు తాజాగా తమ పంథాను మార్చుకున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేయగా.. ఆ బాధ్యతలను జనసేన శ్రేణులు తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్, అనిత వంటి పలువురు నేతల మీద అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టులు పెట్టారని ఇంత వరకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ సారి టీడీపీ చంద్రబాబు, లోకేష్‌లకు బదులు జనసేన పార్టీ, ఆ పార్టీ అధికనేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా ఫిర్యాదులు చేయడానికి జనసేన శ్రేణులు రంగంలోకి దిగారు. జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడం, వాటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయడం మొదలైంది. పోసాని కృష్ణమురిళి కేసుతో ఇది ఆరంభమైంది.
దీనికి తోడు జనసేన గెలిచిన అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోనే జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడం, వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం, తర్వాత అదే నియోజక వర్గం పరిధిలోని కోర్టులో హాజరుపరచడం, తర్వాత జైలుకు తరలించడం కూడా కొత్త పంథాలో భాగమే అనే చర్చలు కూటమి వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో జైనసేన కైవసం చేసుకున్న 21 స్థానాల్లో రైల్వేకోడూరు కూడా ఒకటి. ఇక్కడ కూటమి తరపున బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాస్ మీద విజయం సాధించారు. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం. ఇక నుంచి జనసేన గెలుపొందని 21 జిల్లాల పరిధిలో మరిన్ని కేసులు తెరపైకి రాచ్చనే చర్చ కూడా కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
మరో వైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురిళికి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయనను రాజంపేట స»Œ జైలుకు తరలించారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురి వ్యవహరించారనే అభియోగాలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జోగినేని మణి అనే జనసేన పార్టీకి చెందిన నాయకుడు పోసాని కృష్ణమురళి మీద ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) వంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోసానిని రెస్టు చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పోసాని ఇంటిలో అతనని రెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లోనే దాదాపు 8 గంటల పాటు విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ మీద ఇరు పక్షాల మధ్య వాదనలు కొనసాగాయి.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. నిందితుడు పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పోసానికి రిమాండ్ విధించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ పోలీసుల తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురిళి మీద కేసులు నమోదయ్యాయి. దాదాపు 11 కేసులు పోలీసులు నమోదు చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో పాటు అతని కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని అసభ్యకరంగా, దూరషణలు చేశారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో ప్రసారం అయ్యాయని జనసేన శ్రేణులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజక వర్గం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో మణి అనే జనసేన నాయకుడు ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు.