శ్రీవాణి ట్రస్టును రద్దు చేసే యోచనలో కొత్త టిటిడి చైర్మన్

టీటీడీ చైర్మన్ నియమితుడైన టీవీ5 బీఆర్ నాయుడు తన ప్రాధాన్యతలను వెల్లడిస్తున్నారు

Update: 2024-10-31 13:14 GMT

టీటీడీ చైర్మన్ గా టీవీ5 బీఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. ఈయనతో పాటు 24 మంది పాలక మండలి సభ్యులను కూడా నియమించారు. ఇంకా జీఓ విడుదల కాలేదు. టీటీడీ చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించముందే టీవీ5 బీఆర్. నాయుడు అజెండా సిద్ధం చేసుకున్నారు. తాను సిద్ధం చేసిన అజెండాలో కొన్నింటిని వెల్లడించారు. టీటీడీ చైర్మన్లుగా నియమితులైన వారిలో గతంలో ఎవరూ ఈ తరహాలో ప్రకటించిన దాఖలాలు లేవు. "తన మదిలో ఉన్న ఐదు ప్రాధమ్యాలు" గురువారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. అందులో వివాదాస్పదంగా మారిన "శ్రీవారి ట్రస్టు"ను రద్దు చేసే అంశం మొదటిదిగా వెల్లడించారు. దీనిపై "ఆడిటింగ్ జరుగుతోంది. అది పూర్తి కాగానే నిర్ణయం" ఉంటుందని టీవీ5 బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం తరువాత "తిరుమలలో ప్రక్షాళనకు వారం తరువాతి నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాం" అని స్పష్టం చేశారు.

గతంలో టీటీడీకి చైర్మన్లుగా పనిచేసిన వారెవ్వరూ చేయలేని సాహసం తాజాగా టీడీపీ కూటమిలో నియమితులైన టీవీ5 అధిపతి బీఆర్. నాయుడు చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమలు చేసే అజెండాను ప్రకటించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ప్రాధమ్యాలు ఏమిటంటే...
1. తిరుమలలో హిందూ ఉద్యోగులే ఉండాలి.
2. శ్రీవాణి ట్రస్టు రద్దు
2.టీటీడీ ఆలయ ఆస్తులపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీలు
4.తిరుపతిలో ఉన్న టీటీడీ ఆస్పత్రులు, యూనివర్శిటీపై దృష్టి
5. తిరుమలలో వాటర్ బాటిళ్ల రద్దు. ఉచితంగా పేపర్ గ్లాసులు సరఫరా
రూపాయి తీసుకోను..
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వామి వారి సన్నిధి నుంచి రూపాయి కూడా తీసుకోనని టీటీడీ చైర్మన్ గా నియమితులైన టీవీ5 బీఆర్. నాయుడు స్టషం చేశారు. తిరుమలలో నా ఖర్చులు నేనే భరిస్తా. స్వామివారి సేవ చేస్తా" అని బీఆర్. నాయుడు ప్రకటించారు. తిరుమల గుడి వెనక ఏడు లక్షల టన్నులు చెత్త ఉంది. కొండపై ఉన్న చెత్త ఎలా తొలగించాలనే దానిపై త్వరలో చర్చిస్తాం. ప్రతి నిర్ణయం పాలకమండలి సమావేశంలో తీసుకుంటాం నా సొంత నిర్ణయం అంటూ ఏదీ ఉండదని ఆయన స్టష్టం చేశారు.
హిందూత్వ అజెండా..
తిరుమలలో హిందూత్వ అజెండా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటానని టీవీ5 చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీలో ఉన్న హిందూయేతర ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడమా? లేక ప్రభుత్వ ఇతర శాఖలకు పంపిచాలా? అనేది పాలక మండలిలో చర్చించడానికి ముందు సీఎం ఎన్.చంద్రబాబుతో మాట్లాడతానని తెలిపారు.
"తిరుమల పవిత్రతను అందరూ కాపాడాలి. తిరుమలలో పనిచేసే వాళ్లు హిందువై ఉండాలనేదే నా ప్రయత్నం" అని ఆయన స్టష్టం చేశారు.
శ్రీవాణి ట్రస్టు రద్దు సాధ్యమా?
"టీటీడీలో అనేక ట్రస్టులు ఉన్నాయి. ఇక శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి ట్రస్టు)తో పని ఏముంది?" అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవాని ట్రస్టును రద్దు చేసే ఆలోచన ఉందని టీవీ5 బీఆర్. నాయుడు వెల్లడిచారు. అయితే "శ్రీవాణి ట్రస్టు రద్దు" సాధ్యమా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సీఎం చంద్రబాబు అంగీకరిస్తారా? ఎందుకంటే...
2018 ఆగష్టు 28 న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా "శ్రీవాణి ట్రస్టు"కు ఊపిరి పోసింది సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు పునరుద్ధరణ, కొత్త ఆలయాలకు ఆర్థిక సహకారం అందించడ ఈ ట్రస్టు ఉద్దేశ్యం. ప్రధానంగా అమరావతిలో నిర్మించిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సహకారం కోసం ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరాలు వస్తాయనే మిగతా ఆలయాలకు నిధులు ఇచ్చే నిబంధనలు చేర్చారు. కాగా,
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ అదనపు ఈఓగా పనిచేసిన ఏవీ. ధర్మారెడ్డి ఈ ట్రస్టును విస్తృతం చేశారు. తిరుమలతో పాటు తిరుపతి శ్రీనివాసం యాత్రికుల సముదాయం, తిరుపతి విమాశ్రయంలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
2019 సెప్టెంబర్ తీర్మానం ప్రకారం ఈ ట్రస్టుకు రూ. 10,500 చెల్లిస్తే, రూ. 500 వీఐపీ టికెట్ కేటాయిస్తున్నారు. మిగతా రూ. 10 వేలు ట్రస్టుకు వెళతాయి. ఈ నిధులతో ఆలయాల, జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలకు ఆర్థిక సాయం అందివ్వడం అనేది లక్ష్యం. ఆ విధంగా
2019 నుంచి 2024 వరకు 1,450 కోట్ల రూపాయలు వచ్చాయి. 176 అందులో 350 కోట్ల రూపాయల వరకు పురాతన ఆలయాలను పునరుద్ధరణ, 1853 ఆలయాలు దేవాదాయ శాఖ ద్వారా, 320 ఆలయాలు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు సాగిస్తున్నట్లు పూర్వ టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వివరణ ఇచ్చిన విషయం గమనార్హం. "ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ. 139 కోట్ల రూపాయలు కేటాయించినట్లు" వైవీ. సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.
ఎందుకంటే : శ్రీవారి ట్రస్టు నిధులు దారి మళ్లించారు. అనే టీడీపీ, కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో ఆయన పత్రాలు బహిర్గతం చేశారు. కాగా, ప్రస్తుతం ఆ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. ఆడిటింగ్ జరుగుతోందనే విషయం తాజాగా టీటీడీ చైర్మన్ గా నియమితులైన టీవీ5 బీఆర్. నాయుడు మాటలు స్పష్టం చేస్తున్నాయి.
సాధ్యమా? అనే సందేహానికి కారణం
శ్రీవాని ట్రస్టు వల్ల రాష్ట్రంలోని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాల భారం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని దేవాదాయ శాఖపై భారం తగ్గింది. ఈ ట్రస్టు రద్దు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం భారం ఎత్తుకోవడానికి సిద్ధం అవుతుందా? దీనికి సీఎం ఎన్. చంద్రబాబు అంగీకరిస్తారా? అనేది వేచిచూడాలి.
Tags:    

Similar News