సహస్యాల గని.. శ్రీవారి పుష్కరిణికి బ్రహ్మోత్సవ కళ..

మరమ్మతులు పూర్తికావడంతో నెల తరువాత బుధవారం నుంచి యాత్రికులకు అందుబాటులోకి..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-20 14:23 GMT
తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి

అంతుచిక్కని రహస్యాల నిధి.. తిరుమలలో శ్రీవారి పుష్కరిణి యాత్రికులకు బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా పుష్కరిణిని శుభ్రం చేయడంతో పాటు దాదాపు కోటి లీటర్ల నీటితో నింపారు.

శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల ముందు నుంచే అంటూ జూలై 19వ తేదీ నుంచి పుష్కరిణిలో నీటిని తోడేయడం ద్వారా మరమ్మతులు చేశారు.

తిరుమల శ్రీవారి పుష్కరిణి అంతుచిక్కని రహస్యాలకు నిలయం అనడంలో సందేహం లేదు. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు కలుస్తాయనేది చారిత్రక నేపథ్యం. వరాహపురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ పుష్కరిణిలో అపురూప దృశ్యాలు ఏడాదిలో నెల పాటు పురాతన కాలం నాటి కోనేరును చూసే అవకాశం దొరుకుతుంది. వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేరులో శతాబ్దాల కిందట తవ్విన మరో కోనేర్లు రెండు కనిపిస్తాయి. ఓ కోనేరులో నీరు ఉబికి వచ్చే దృశ్యం కూడా చూడవచ్చు. ఆలయానికి ఎదురుగా అంటే లడ్డూ ప్రసాదాలు తీసుకునేందుకు మాడవీధిలో వెళ్లే సమయంలో మరో అపురూప దృశ్యం కోనేరులో కనిపిస్తుంది. అందులో ప్రధానంగా పుష్కరిణిలో ఏడుబావులు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని కొన్ని దశాబ్దాల కిందట మూసివేశారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉన్నట్లు కూడా ఓ కథనం. పుష్కరిణిలోని ఆ బావుల నుంచి నిత్యం నీరు ఉబికిరావడం ఎక్కువ అయినందువల్ల మూసివేయడానికి దారి తీసినట్లు చెబుతున్నారు.

మరమ్మతులు పూర్తి
ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోనేరును శుభ్రం చేసే పనులు పూర్తి చేశారు. నెలలపాటు స్నానాలు ఆచరించే యాత్రికులు వదిలేసిన దుస్తులు, నీటిలోని నాణేలు ఏరివేయడం తోపాటు మట్టి, పాచి కూడా తొలగించారు. పుష్కరిణి మరమ్మ‌తులు పూర్తికావడంతో కొత్త హంగులతో కనువిందు చేస్తోంది. బుధ‌వారం నుంచి యాత్రికులను స్నానాలు చేయడానికి అనుమతిస్తున్నారు.

టీటీడీ ఈ మర‌మ్మ‌తు పనులు జూలై 20 తేదీ ప్రారంభించింది. పుష్కరిణిని శుభ్రం చేయడంలో వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు వంద మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేశారు. పుష్కరిణి మెట్లకు ఆక‌ర్ష‌ణీయంగా పెయింటింగ్‌ తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మర‌మ్మ‌తులు పూర్తికావడంతో దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపారు.
Tags:    

Similar News