కియా పరిశ్రమలో 900ల కారు ఇంజిన్ల చోరి జరిగిందట!

రాయలసీమ నుంచి తరలించే పథకం కాదుగా?;

Update: 2025-04-09 04:24 GMT


సత్యసాయి జిల్లా లో ఉన్న  కియా పరిశ్రమ (Kia Motors) లో భారీ దొంగతనం జరిగింది. లోన, బయట ఉన్న పూర్తి సర్వేలెన్స్ ఉన్న కొరియన్ కంపెనీ నుంచి దొంగ తనం జరిగిందంటే నమ్మడం కష్టం. అందునా మామూలు దొంగతనం కాదు. 900 ఇంజిన్లను దొంగతనం చేశారు. ఇంజిన్ అంటే ఏదో జేబులో పెట్టుకుని పోయేది కాదు. భారీ బరువుతో ఉండే సామాను. ఇలాంటి భారీ సామాన్లను అందునా 900 లను తీసుకుపోవడం సాధ్యమా. అందుకే దీని మీద అనుమానాలు వస్తున్నాయి. 

ఈ సంస్థలో  పనిచేస్తున్న  రాయలసీమ చిరు ఉద్యోగస్థుల మీద ఈ చోరి నిందలు మోపి కియా పరిశ్రమను ఆ అమరావతి రాజధాని ప్రాంతానికి తరలించే ప్రయత్నమా అని  రాయలసీమ ఉద్యమకారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంచెం తీవ్రమయిన అనుమానమే అయినా, సర్వం అమరావతికే తరలిస్తున్నా వాతావరణంలో ఇలాంటి అనుమానాలు వస్తాయి.

"లేకపోతే ఇంత భారీగా చోరీలు ఎలా జరుగుతాయి,ఈ పరిశ్రమలో ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారికి మాత్రమే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది,,, అలాంటప్పుడు కియా పరిశ్రమలో కీలకమైన ఉద్యోగస్థులకు తెలియకుండ ఈ చోరీలు జరిగే అవకాశమే లేదు,,, కాబట్టి ఈ విషయములో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పోలీసులు చోరీదారులను అందుకు కుట్ర దారులు ఎంత పెద్ద వారైన అరెస్టు చేయాలని మా రాయలసీమ ఉద్యమకారుల డిమాండ్," అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు.

అసలు జరిగిందేమిటంటే...

శ్రీస త్యసాయి జిల్లా పెనుకొండ సమీ పంలోని కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీ అయినట్లు పోలీ సులు తెలిపారు. 2020 నుంచి ఐదు సంవత్సరాలుగా ఈ చోరీలు జరుగుతున్నాయని గుర్తించినట్లు వారు పేర్కొ న్నారు. పెనుకొండ డీఎస్పీ వై. వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. "ఇంజిన్ల దొంగతనాలు ఐదేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. మొత్తం సుమారు 900 ఇంజిన్లు చోరీకి గురయినట్లు గుర్తించాం. మ్యాను. ఫ్యాక్చరింగ్ యూనిట్కు వచ్చే మార్గంలో, వచ్చాక కూడా ఈ దొంగతనాలు జరిగాయి. ఈ చోరీల్లో నిందితులు లోపలివారే. కంపెనీ లోపలి నుంచి చిన్న వస్తువును కూడా తీసుకురావడం సాధ్యం కాదు. దర్యాప్తులో భాగంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను, ప్రస్తుతం పని చేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నాం. కొన్ని అవకతవకలను ఇప్పటికే కనుగొన్నాం' అని పేర్కొన్నారు.

ఈ ఇంజిన్లు కొరియానుంచి దిగుమతి అవుతాయి. మొదట చెన్నై ఓడరేవుకు చేరుకుంటాయి అక్కడి నుంచి కంటైన ర్లలో రోడ్డు మార్గంలో నేరుగా కియా పరిశ్రమ ఆవరణలోని హ్యుండాయ్ సంస్థకు చేరతాయి. ఆ తర్వాత అవసరమైనప్పుడు పరిశ్రమలోకి తీసుకెళతారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇంజిన్ల చోరీని గుర్తించిన సంస్థ ఎండీ, సీఈవో గ్వాంగులీ జిల్లా ఎస్పీని కలసి గోప్యంగా దర్యాప్తు చేయాలని కోరారు. అధికారికంగా ఫిర్యాదు చేయాలని చెప్పడంతో మార్చి 19న కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్లో వారు కేసు పెట్టినట్లు సీఐ రాఘవన్ తెలిపారు.

స్థానికులకు ఉద్యోగాలేవీ?

రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలను మన స్థానిక రాయలసీమ యువతకు ఇస్తే ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలరని నాగార్జున రెడ్డి అన్నారు.  "ఇప్పటికైనా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న మన రాయలసీమ నిరుద్యోగ యువత కోసం ఈ ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమలలో స్థానిక రిజర్వేషన్ ను అమలు చేయడానికి పరిశ్రమల యాజమాన్యాలకు జీఓ జారీ చేయాలి అప్పుడే మన రాయలసీమ ప్రాంతం నుండి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలసలు పోవడం ఆగుతాయి,"అని నాగార్జున రెడ్డి అన్నారు.

Tags:    

Similar News