కొడాలి నానికి 41సీఆర్‌పీసీ నోటీసులు
చంద్రబాబు, లోకేష్‌లను దుర్భాషలాడారని 2024లో విశాఖ లా విద్యార్థిని అంజనాప్రియ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు.;
By : The Federal
Update: 2025-08-03 08:12 GMT
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నానిపై కేసు తెరపైకి వచ్చింది. విచారణకు రావాలని గుడివాడకు వెళ్లిన విశాఖపట్నం పోలీసులు కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు. దీంతో కొడాలి నాని కేసు మరో సారి చర్చనీయాంశంగా మారింది.
అంజనీప్రయ అనే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్శిటీ లా కాలేజీ విద్యార్థిని కొడాలి నాని మీద విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారా చంద్రబాబు, నారా లోకేష్‌లను అసభ్యకరంగా కొడాలి నాని దుర్భాషలాడారు. చంద్రబాబు మీద, లోకేష్‌పైన కొడాలి నాని తిట్లను ఓ మహిళగా తాను భరించలేకపోయాను. అలా అసభ్యకరంగా మాట్లాడినందుకు కొడాలి నానిపైన కేసు నమోదు చేయాలని 2024లో విశాఖపట్నం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విశాఖ త్రీటౌన్ సీఐ రమణయ్య కొడాలి నానిమీద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ u/ట353(2), 352, 351(4) సెక్షన్ల కింద కొడాలి నాని మీద అప్పట్లో కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసును తెరపైకి తెచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కొడాలి నానికి నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లని విశాఖ త్రీటౌన్ పోలీసులు 41సీఆర్‌పీసీ నోటీసులు అందజేసి, విచారణకు రావాలని సూచించారు.