మూడు రోజుల్లో 40 మంది బాలికలకు విషజ్వరాలు

ఆం«ధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న అంతుచిక్కని వ్యాధులు.;

Update: 2025-09-14 06:24 GMT

ఆంధ్రప్రదేశ్‌ను అంతుచిక్కని వ్యాధులు, డయేరియా, విషజ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గత ఆరు నెలలుగా అంతుచిక్కని వ్యాధుల బారిన పడి ఇప్పటికే 30మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకు మరణించారో ఇంత వరకు తేలలేదు. తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది. గుంటూరు అర్భన్‌ మండలం పరిధిలోని తురకపాలెం, చేబ్రోలు మండలం పరిధిలోని కొత్తరెడ్డిపాలెం విలవల్లాడిపోతున్నాయి. ఏ రోజు ఏ మరణ వార్త వినాల్సి వస్తోందో అని ప్రాణాలు పెట్టుకుని క్షణాలు యుగాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ నగరం నడిబొడ్డులో డయేరియా కలకలం రేపుతోంది. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన వాసులు దాదాపు 120 మంది వరకు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఇప్పటికీ పాఠశాలలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తయానే దానిపై ఇంత వరకు స్పష్టత లేదు. రంగు మారిన తాగు నీటి వల్ల నగర వాసులు రోగాల బారిన పడుతున్నాని స్థానికులు ఆరోపిస్తుండగా, œ#డ్‌ పాయిజన్‌ వల్లే ఇది జరిగి ఉంటేందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పడు తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు తాండవం చేయడం కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా ఇక్కడి బాలికలు విషజ్వరాల బారినపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో 40 మందికిపై విద్యార్థులు విషజ్వరాల బారిన పడ్డారు. ఇలా తీవ్ర అస్వస్తతకు గురైన వారికి వైద్య పరీక్షలు చేయగా ఇద్దరి మలేరియా అని నిర్థారాఇంచిన వైద్యులు తక్కిన వారికి సాధారణ జ్వరం వచ్చిందని తేల్చారు. ఈ నేపథ్యంలో అటు బాలికల్లోను, ఇటు వారి తల్లిదండ్రుల్లోను తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఒక్క సారిగా విద్యార్థులందరికీ ఇలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తడంతో 20 మంది బాలికలను వారి ఇళ్లకు పంపారు. అదే పాఠశాలలో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించి తక్కిన వారికి పరీక్షలు నిర్వహించడం, చికిత్సలు అందించడం చేస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయా.. లేదా.. పారిశుధ్య నిర్వహణ సరిగా లేనందు వల్ల బాలికలు రోగాల బారిన పడుతున్నారా అనేది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News