ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
దైవదర్శనానికి వెళుతున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరు ఎక్కడి వారు అనేది ఇంకా తెలియలేదు.;
By : The Federal
Update: 2025-08-09 02:30 GMT
ప్రకాశం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాకిచెర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో వీరు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వీరిని నెల్లూరుకు తరలించారు. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పిడుగురాళ్ల పోలీసులకు సమాచారం అందించారు.