చేవెళ్ళ దగ్గర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి(వీడియో)

సోమవారం తెల్లవారి సుమారు 5 గంటల ప్రాంతంలో చేవెళ్ళ మండలం ఫీర్జాదీగూడ దగ్గర(Road accident) ఈప్రమాదం జరిగింది.

Update: 2025-11-03 03:42 GMT
20 died in road accident

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ళ దగ్గర ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్ ఢీకొన్నపుడు జరిగిన ప్రమాదంలో 20 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, 18మంది ప్రయాణీకులున్నారు. సోమవారం తెల్లవారి సుమారు 5 గంటల ప్రాంతంలో చేవెళ్ళ మండలం ఫీర్జాదీగూడ దగ్గర(Road accident) ఈప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 70 కిలోమీటర్ల స్పీడుతో హైదరాబద్ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొన్నది. బస్సును బలంగా ఢీకొనటంతో టిప్పర్లోని కంకరంతా బస్సులో పడిపోయింది. రెండువాహనాలు డ్రైవర్లు చనియారు. డ్రైవర్ వెనక సీట్లో కూర్చుకున్న వారికి ప్రమాదానికి ఎక్కువ గుర్తయ్యారు. బస్సు-టిప్పర్ బలంగా ఢీ కొనటంతో టిప్పర్లోని కంకర ప్రయాణీకుల్లో పడటంతో కొందరు అందులో కూరుకుపోయారు. ప్రయాణీకులు నిద్రలో ఉండటంతో తేరుకునేందుకు సమయంపట్టింది. దాంతో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. కంకర్లో పాక్షికంగా కూరుకుపోయిన ప్రయాణికుల ఆర్థనాదాలు హృదయాలను కలచివేసేలా ఉన్నాయి.  హైదరాబాద్ కు 60 కి.మీ దూరాన ఉన్న మీర్జాగూడా సమీపాన ఉన్న ఖానాపూర్  గేట్ వద్ద ఈ విషాద సంఘటన జరిగింది.

Full View

తాండూరు డిపోకు చెందిన బస్సు మీర్జాగూడ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ బలంగా బస్సును ఢీకొన్నది. దాంతో టప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణీకులమీద పడిపోయింది. కంకరమీద పడటంతో ప్రయాణీకులు ఊపిరి ఆడకుండా 20 మంది చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా ఘటనలోనే చనిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు వెంటనే సహాయచర్యలకు రంగంలోకి దిగటమే కాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులురాగానే గాయపడిన వారిని బస్సులో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా చేవెళ్ళ-వికారాబాద్ నేషనల్ హైవేపై భారీఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు వెల్డింగ్ మిషన్ను ఉపయోగించి బస్సు కిటీకలను, బస్సులోకి చొచ్చుకుపోయిన టిప్పర్ భాగాలను కట్ చేస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు: ముఖ్యమంత్రి 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. సహాయకచర్యలకోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్ కి ముఖ్యమంత్రి ఫోన్ లో ఆదేశాలిచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.

రవాణా మంత్రి దిగ్భాంతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదకారణాలపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచనలిచ్చారు. కంకర లోడు తో ఉన్న ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని కూగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Tags:    

Similar News