ఎపి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం ను అణిచివేయడంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారు.  విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు, సంతోషాలను త్యాగం చేస్తున్న మీ కుటుంబాలకు నమస్కారాలు చెపుతున్నా. నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. మరి వారి ఆటకట్టించాలంటే మీరు మరింత అప్ డేటెడ్ వెర్షన్ తో ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం. సిసి టీవీ కెమేరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నళ్లు, గూగుల్ టేకవుట్లు... ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎటువంటి నేరస్తుడిని అయినా పట్టుకోవచ్చు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్‌గా పట్టుకోవచ్చు. డ్రోన్లతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు.. స్మగ్లింగ్‌ను అరికడుతున్నారు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చం దనం దొంగలను కట్టడి చేస్తున్నారు. నేరస్తులు ఇంటలిజెంట్ క్రైస్ చేస్తున్నారు. వారి కంటే ఒక అడుగు ముందుండాలి అని సూచించారు. 
నక్సలిజం చూశాం. కొంత మంది మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. డబ్బుల కోసం రౌడీయిజం చేసి ముఠాలుగా మారారు. పోలీస్ అంటే సమర్థవంతంగా ఉండాలి...పోలీస్ అంటే భయం ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి. డీ ఫంక్ట్ అయితే వాటిని ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడతారు. సమజాంలో అశాంతిని సృష్టించడానికి కొత్తకొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధాంతం పేరుతో, ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం నేరాలు చేసే వారు ఉన్నారు. ఇలాంటి వాటిని తుదముట్టించాలి. నేరాల కట్టడి విషయంలో సీరియస్సుగా ఉండాలి.. లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడూ రాజీపడలేదు. అందుకే నాపై నక్సలైట్లు క్లైమౌర్ మైన్లతో దాడి చేశారు. ఓ దొంగ, ఓ డెకాయిట్ ఏదోక ప్రాంతానికే పరిమితమవుతారు. కానీ రాజకీయ ముసుగులో చేసే నేరాలతో సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్టుగా ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రయత్నం చేశారు.. దీనికి రాజకీయాన్ని జోడించే ప్రయత్నం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయటపెట్టగలిగాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్లే తగులపెట్టి ప్రభుత్వంపై నెపాన్ని నెట్టారు. అంబేద్కర్ విగ్రహనికి నిప్పు పెట్టారని ఆందోళనలు చేశారు.. కానీ వాస్తవాలను బయట పెట్టి కుట్రను చేధించాం. మద్యం విషయంలోనూ ఇదే తరహా కుట్రలు పన్నుతున్నారు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  సోషల్ మీడియా అనేది పోలీసులకు అతి పెద్ద ఛాలెంజ్.  ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.  సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారు.  శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదు.  ఆడబిడ్డలపై అరాచకం చేస్తే.. అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలి. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి.. ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.