తీవ్ర ఉద్రిక్తిత, ఉత్కంఠల నేపథ్యంలో జగన్ పర్యటన
నేడు మాజీ సీఎం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటన చేయనున్నారు.
ఏపీలో 17 మెడికల్ కాలేజీల ప్రైవటైజేషన్‌పై కూటమి ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోవాలనే పోరాటంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం (నర్సీపట్నం) మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలకు వ్యతిరేకంగా ఈ పర్యటన చేపట్టినప్పటికీ, పోలీసులు విధించిన కఠిన ఆంక్షలు, భద్రతా ఆందోళనలు పార్టీలో తీవ్ర ఉత్కంఠకు దారి తీసాయి. వైఎస్సార్సీపీ నేతలు "ప్రభుత్వం ప్రతిపక్ష నేతకు ప్రజలతో సమావేశాన్ని అడ్డుకుంటోంది" అని ఆరోపిస్తున్నారు.ఇలాంటి ఉత్కంఠ నేపథ్యంలో జగన్ ఉదయం 9:20కి తడేపల్లి నుంచి విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరి, 11 గంటలకు విశాఖ చేరుకుని, మధ్యాహ్నం మెడికల్ కాలేజీని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3:30కి KGHను సందర్శించి, సాయంత్రం 5:20కి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
పోలీసులు విధించిన ఆంక్షలు: భద్రతా కారణాలు, తమిళనాడు ఘటన ఉదాహరణ
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్లు 30 & 30A కింద షరతులతో అనుమతి మంజూరు చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం, జగన్ పర్యటనకు 'జీరో టాలరెన్స్' విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల తమిళనాడు కరూర్‌లో విజయ్ ర్యాలీ సందర్భంగా 41 మంది మరణించిన స్టాంపేడ్ ఘటనను ఉదాహరణగా చూపి, క్రౌడ్ వయోలేషన్స్, ర్యాలీలు, రూట్ బ్రీచ్‌లకు అనుమతి లేదని హెచ్చరించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి మాకవరపాలెంకు 63 కి.మీ. NH-16 మార్గంలో రోడ్ షోకు అనుమతి తిరస్కరించారు. బదులుగా, షార్ట్‌కట్ రూట్‌లో 50-55 కి.మీ. ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. Dr. YSR ACA-VDCA స్టేడియంలో ICC మహిళల క్రికెట్ మ్యాచ్ కారణంగా అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. మల్టీ-డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణలు పూర్తి స్థాయిలో ఉన్నాయి.
ఏడు రకాల ఆంక్షలు
- రోడ్ షో, ర్యాలీలు, సమావేశాల నిషేధం: మార్గంలో పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు జరపకూడదు. మాకవరపాలెంలో మాత్రమే 2,500 మందికి అనుమతి.
- వాహనాల పరిమితి: జగన్ కాన్వాయ్‌లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి.
- రూట్ మార్పు నిషేధం: అధికారిక రూట్‌కు మార్పులు, అదనపు మార్పలు, చేర్పులు చేయకూడదు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతి రద్దు, కేసులు.
- జన సమీకరణ నిషేధం: NH-16, SH-38 మార్గాల్లో సమర్థకులు ట్రాఫిక్ అవరోధాలు సృష్టించకూడదు.
- బాధ్యత, భారం: ప్రజలకు గాయాలు, మరణాలు, ఆస్తి నష్టాలు సంభవిస్తే వాటికి వైఎస్సార్సీపీ నిర్వాహకులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. రాతపూర్వక పత్రం సమర్పించాలి.
- భద్రతా ఏర్పాట్లు: విమానాశ్రయం నుంచి అనకాపల్లి వరకు పూర్తి సెక్యూరిటీ, క్రికెట్ మ్యాచ్ కారణంగా అదనపు బందోబస్తు.
- ఉల్లంఘనలకు చర్యలు: నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు.
జగన్ పర్యటన లక్ష్యాలు: ప్రైవటైజేషన్‌పై ఒక కోటి సంతకాల సేకరణ
జగన్ పర్యటన ప్రధాన లక్ష్యం, మెడికల్ కాలేజీల PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌పై వ్యతిరేకతను బలపరచడం. వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడం, తద్వారా వారి మద్దతు కూడగట్టుకోవడం. తన ప్రభుత్వ కాలంలో 17 మెడికల్ కాలేజీలను ఉచిత విద్య, వైద్య సేవలతో స్థాపించామని, చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం ద్వారా పేదలు, విద్యార్థులు దెబ్బతింటారని ఆరోపిస్తున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించి, ప్రైవటైజేషన్‌పై 'ఒక కోటి సంతకాల పోరాటం'ను ప్రకటించనున్నారు. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి, విధానాన్ని ఆపమని డిమాండ్ చేయాలనేది జగన్ ప్రణాళిక. పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ (VSP) ఉద్యోగులతో సమావేశమై, మెమోరెండమ్ స్వీకరించాలని తొలుత జగన్ భావించారు. కానీ పోలీసులు దీనికి అవకాశం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ నేతలు "జగన్ పర్యటన జరుగుతుంది, ఆంక్షలు అడ్డుకోలేవు" అని స్పష్టం చేశారు.
రూట్ వివరాలు: పోలీసులు సూచన vs జగన్ ప్రణాళిక
జగన్ NH-16 మార్గంలో 63 కి.మీ. రోడ్ షో, 65,000 మంది వైసీపీ కార్యకర్తలతో మీటింగులు జరపాలని ప్రణాళిక చేశారు. కానీ పోలీసులు భద్రతా కారణాలతో తిరస్కరించి, షార్ట్‌కట్ రూట్ సూచించారు
- పోలీసు రూట్ (50-55 కి.మీ.): విమానాశ్రయం → NAD జంక్షన్ → పెందుర్తి → సరిపల్లి → అనకాపల్లి → పుదిమడక → కొట్టూరు → తాళ్లపాలెం → మాకవరపాలెం.
- జగన్ ప్రణాళిక (63 కి.మీ.): విమానాశ్రయం → NH-16లో గాజువాక → అగనంపూడి → లంకెలపాలెం → అనకాపల్లి → మాకవరపాలెం.
మొత్తమ్మీద తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ జగన్ పర్యటన సాగనుండటంతో ఈ పర్యటన ఏ రకమైన మలుపులకు, పరిణామాలకు దారి తీస్తుందో అనేది సర్వత్రా ా ఆసక్తి నెలకొంది.