చరణ్‌ మృతికి పవన్‌ కల్యాణ్‌ విచారం

సోషల్‌ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.;

Update: 2025-08-27 13:21 GMT

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్‌ ఆడటానికి పోల్స్‌ నిలబెడుతున్న సమయంలో అది కరెంట్‌ తీగలకు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై ఏడిద చరణ్‌ అనే యువకుడు మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. చరణ్‌ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు ఏడిద చరణ్‌ కుటుంబానికి తన ప్రగాభ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
మూలపేట గ్రామంలో కరెంట్‌ షాక్‌కు గురైన యువకుడు మృతి చెందడం బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్‌ ఆడుకునేందుకు పోల్స్‌ నిలబెడుతున్న సమయంలో కరెంట్‌ షాక్‌ వల్ల ఏడిద చరణ్‌ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడని తెలిసి చింతిస్తున్నాను. చరణ్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడ్డారని అని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశాను. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పమని సూచించాను.
క్రీడా ప్రాంగణాల్లో కావచ్చు, పని ప్రదేశాల్లో కావచ్చు పోల్స్‌ లాంటివి నిలిపేపటప్పుడు ఎల్తైన ప్రదేశాలలో నిర్మాణాల్లాంటివి చేపట్టినప్పుడు విద్యుత్‌ షాక్‌కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ దశలోను అశ్రద్ధ వహించవద్దు. ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను.. అంటూ పవన్‌ కల్యాణ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News