చంద్రబాబు కోరారు..గడ్కరీ ఓకే చెప్పారు..
ఆంధ్రప్రదేశ్ కు సుమారు 25 వేల కోట్ల రూపాయల రోడ్ల అభివృద్ది కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన కేంద్ర మంత్రి గడ్కరీ;
By : V V S Krishna Kumar
Update: 2025-08-03 10:05 GMT
కేంద్రం లోని ఎన్డీఏ సర్కారులో టీడీపీ పాత్ర కీలకంగా వుండటంతో ఏపీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి కావాల్సిన పనులను కేంద్రం ముందుంచి ,ఓకే చేసుకుంటున్నారు.ప్రస్తుతం కేంద్ర రవాణా , జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో పలు రోడ్ల అభివృద్ది ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పడింది. శనివారం ఏపీలో పలు ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ కొత్త ప్రాజెక్టులకు గ్రాంట్లు ప్రకటించారు.
రోడ్డు ప్రాజెక్టుల కేటాయింపు కోసం చంద్రబాబు గతంలో చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా, ఈ రోడ్డు ప్రాజెక్టులను గడ్కరీ ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ కు గడ్కరీ కొత్తగా ప్రకటించిన రోడ్డు ప్రాజెక్టులు ఇవే ...
హైదరాబాద్ - విజయవాడ రహదారి, 6 లేన్ల విస్తరణ .. అంచనా వ్యయం: ₹6,700 కోట్లు
విజయవాడ - మచిలీపట్నం రహదారి, 6 లేన్ల విస్తరణ.. అంచనా వ్యయం: ₹2,600 కోట్లు
వినుకొండ - గుంటూరు రహదారిని 4 లేన్లకు విస్తరించనున్నారు. అంచనా వ్యయం: ₹2,605 కోట్లు
గుంటూరు - నిజాంపట్నం రహదారిని 4 లేన్లకు విస్తరించనున్నారు. అంచనా వ్యయం: ₹2,000 కోట్లు
బుగ్గకయ్యపేట - గిద్దలూరు రహదారి 4 లేన్ల విస్తరణ.. అంచనా వ్యయం: ₹4,200 కోట్లు
అకివీడు–దిగమర్రు రోడ్డు 4 లేన్ల విస్తరణ.. అంచనా వ్యయం: ₹2,500 కోట్లు
పెదన – లక్ష్మీపురం రోడ్డు 4 లేన్ల విస్తరణ... అంచనా వ్యయం: ₹4,200 కోట్లు
ముదునూరు–కడప రోడ్డు 4 లేన్ల విస్తరణ ... అంచనా వ్యయం: ₹1,182 కోట్లు
వీటితో పాటు, రాబోయే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోట్ల బడ్జెట్‌తో మరిన్ని ప్రాజెక్టులు కేటాయిస్తామన్న సమాచారం ఈయడంతో , గణనీయమైన కేటాయింపులు ప్రకటించిన నితిన్ గడ్కరీకి చంద్రబాబు నాయుడుతో పాటు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.