లిక్కర్ స్కాం .. సిట్ చేతికి మరో ఆధారం

నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో లభ్యంతో మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి;

Update: 2025-08-03 07:33 GMT

ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న వెంకటేశ్ నాయుడు, కోట్ల రూపాయల నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో ఒకటి సిట్ అధికారుల చేతికి చిక్కింది.ఇటీవలే హైదరాబాద్ లో ఏకంగా 11 కోట్ల డబ్బు , ఇప్పుడు ఈ వీడియో సిట్ అధికారులు కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతున్నాయి.ఎన్నికల ముందు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఈ డబ్బు మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులేనని సిట్ బలంగా నమ్ముతోంది..వెంకటేశ్ నాయుడు భారీ మొత్తంలో నగదును లెక్కిస్తూ, వాటిని బాక్సులలో సర్దుతున్న దృశ్యాలు సిట్ కు దొరికిన వీడియోలో స్పష్టంగా ఉంది.దీనిపై శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్న సిట్‌ అికరులు ఈ వీడియో ఒక బలమైన సాక్ష్యంగా ఉపయోపడుతుందని పేర్కొంటున్నారు.

ఈ వీడియో ఆధారంతో కేసు దర్యాప్తును సిట్ మరింత వేగవంతం చేస్తోంది.ఇంకా ఇలాంటి విడియోలు వున్నాయా, ఎక్కడెక్కడ డబ్బు దాచి పెట్టారు. ఆ స్థావరాలను కనిపెట్టే పనిలో సిట్ అధికారులు వున్నారు. ప్రస్తుతం సిట్ కు చిక్కిన కీలక వీడియోతో మరికొంత మంది ప్రమేయాన్ని కూడా కూపీ లాగవచ్చని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలో దాదాపు రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ ప్రాథమికంగా అంచనా వేసి, ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించింది.ఈ దర్యాప్తు క్రమంలో హైదరాబాద్ లో భారీగా డబ్బు దొరకడం , వెనువెంటనే ఇప్పుడు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న విడియోతో ఈ కేసు కు మరింత బలం చేకూరింది.అయితే సిట్ అధికారులు హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు.మరి ఇప్పుడు డబ్బు లెక్కిస్తున్న వీడియో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News