అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావాద్ సిద్ధిఖీ అరెస్ట్..

విశ్వవిద్యాలయ ట్రస్టు నుంచి షెల్ కంపెనీలకు డబ్బు బదిలీ..

Update: 2025-11-19 08:55 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi) ఎర్రకోట సమీపంలో కారు పేలుడు(car blast) ఘటనతో సంబంధం ఉందని భావిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్టు చేసింది. నవంబర్ 10న జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫరీదాబాద్‌కు చెందిన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ట్రస్టీలు, ప్రమోటర్లపై ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని ఈడీ అధికారులు PTIకి తెలిపారు. ఉదయం 5.15 గంటలకు ప్రారంభమైన సోదాల్లో రూ. 48 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.


ట్రస్ట్ కార్యాలయంపై దాడి

ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని అల్ ఫలాహ్ ట్రస్ట్ కార్యాలయంపై కూడా ED అధికారులు దాడి చేశారు. పోలీసులు, పారామిలిటరీ దళాలు భవనం చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు.1990ల నుంచి అల్-ఫలాహ్ గ్రూప్ ఒక పెద్ద విద్యా సంస్థగా రూపాంతరం చెందింది. ఇదే కేసును దర్యాప్తు చేస్తోన్న NIA ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసింది. ట్రస్ట్ ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు కుటుంబ యాజమాన్యంలోని సంస్థలకు మళ్లించారని ఏజెన్సీ ఆరోపించింది.


షెల్ కంపెనీలు..

గ్రూప్‌తో తొమ్మిది షెల్ (డమ్మీ) కంపెనీలు ఒకే చిరునామాలో నమోదు చేయి ఉన్నట్లు ED పరిశీలనలో తేలింది. 1956 నాటి UGC చట్టంలోని సెక్షన్ 12(B) కింద అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం UGC గుర్తింపును తప్పుగా క్లెయిమ్ చేసిందని, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, వాటాదారులు, సాధారణ ప్రజలను మోసం చేసి తప్పుడు లాభం పొందాలనే ఉద్దేశంతో ఉందని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News