భారతీయ నాగరికతకు సేవే మూలసూత్రం

సత్యసాయి జయంతి వేడుకలో ప్రధాని మోదీ

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-19 10:09 GMT
పుట్టపర్తి సత్యసాయి సమాధి వద్ద చిత్రపటానికి మొక్కుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

సత్యసాయి బాబా సేవలతో అందరి హృదయాల్లో నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. "Love All – Serve All" అనే మాటలు ప్రేమను వగా మార్చే ఆధ్యాత్మిక సందేశం అని ప్రధాని మోదీ విశ్లేషించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో సత్యసాయి సంస్థలు చేసిన సేవలతో ఆధ్యాత్మికత, సేవ అనేవి వేర్వేరు కాదని నిరూపించాయన్నారు.


భారతీయ నాగరికతకు ప్రధానమైనది సేవ. భక్తి, జ్ఞాన, కర్మ ఏమార్గంలో నడిచినా, చివరకు చేరేది సేవలోకే అని ప్రధాని మోదీ జీవితసత్యాన్ని గుర్తు చేశారు. అదే భారతీయ సంస్కృతి, శతాబ్దాల మార్పుల మధ్య నిలిచిన బలమైన పునాది అని అన్నారు.
భగవాన్ శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలతో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం సందర్శించారు ప్రత్యేక విమానంలో ఆయన పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతించారు.
ప్రశాంతి నిలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన సాయికుల్వంత్ హాలులోని సమాధి వద్ద కొన్ని నిమిషాల పాటు కూర్చుని మౌనంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా ట్రస్టు ద్వారా ఆవులు కూడా పంపిణీ చేశారు.

సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని అనేక దేశాలు, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఆసక్తికరంగా చూశారు. దాదాపు రెండు గంటలపాటు ప్రధాని నరేంద్రమోదీ వేదికపై సీఎం చంద్రబాబు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య బచ్చన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె. రత్నాకర్,సత్యసాయి విద్యాసంస్థల వీసీ చక్రవర్తి, రాష్ట్ర మంత్రులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తూ గడిపారు.

తెలుగులో ప్రారంభించి...
ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు. అందరినీ పేరుపేరునా పలకరించారు. సాయిరాం అంటూ ఆ తరువాత హిందీలో ప్రసంగం ప్రారంభించారు. ఆ తరువాత "సాయిరాం" అంటూ తన మాటలు మొదలుపెట్టిన ఆయన, పుట్టపర్తి పవిత్ర భూమిలో ఉండటం తనకు ఆధ్యాత్మిక, భావోద్వేగ అనుభూతి కలగిస్తుందని అని భావోద్వేగంగా అన్నారు. కొద్దిసేపటి కిందటే భగవాన్ బాబా మహాసమాధి వద్ద పుష్పాంజలి సమర్పించే అవకాశం లభించడం తనకు మహాదైవిక అనుభవంగా ప్రధాని మోదీ తన భావాలను పంచుకున్నారు.
“బాబా బోధనలు పుస్తకాలలో గానీ, ఆశ్రమ గోడలలో గానీ మరుగునపడలేదు. పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల దాకా ఆయన విద్య, ఆరోగ్య, సేవా కార్యక్రమాలు కోట్ల మందిని స్పృశిస్తున్నాయి. “మానవ సేవే మాధవ సేవ” సత్యసాయి భక్తుల అత్యున్నత ఆచరణ సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

సత్యసాయి బాబా శతజయంతి ఈ తరానికి ఒక వేడుక మాత్రమే కాదు. ఒక దైవ ఆశీర్వాదం. ఆయన భౌతికంగా మనతో లేరన్న విషయం నిజమే కానీ ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన సేవాస్ఫూర్తి నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని 140కు పైగా దేశాల్లో లక్షలాది మంది సత్యసాయి బాబా బోధనల ప్రకారం జీవనదిశను మార్చుకున్నారని ఆయన గుర్తుచేశారు. సత్యసాయి బాబా జీవితం వసుధైవ కుటుంబ భావానికి నిలువెత్తు ఉదాహరణ అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. అందుకే ఈ శతజయంతి సంవత్సరం ప్రపంచ ప్రేమ, శాంతి, సేవల పర్వదినంగా మారిందని అన్నారు.
వంద నాణెం విడుదల
సత్యసాయి శతజయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం సిద్ధం చేసిన రు.100 జ్ఞాపిక నాణెం తోపాటు పోస్టల్ స్టాంపులు ఆవిష్కరించారు. ఈ అవకాశం దక్కడం తమ ప్రభుత్వానికి ఒక గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
మరువలేనిది
గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు సత్యసాయి సేవాదళ్ అప్రతిహత సేవలను ప్రధాని మోదీ గుర్తు చేశారు. సేవలకు ప్రతిరూపం అనడానికి అదో ఉదాహణరగా అభియన అభివర్ణించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రాయలసీమకు తాగునీరు అందించేందుకు మూడు వేల కిలోమీటర్లు పైప్‌లైన్ వేసిన విషయంలోనే కాకుండా, ఒడిశాలో వరద బాధితులకు వెయ్యి ఇళ్లు నిర్మించి ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదన్నారు.
పుట్టపర్తిలో కూడా బిల్లింగ్ కౌంటర్ లేని ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలతో ప్రపంచానికే ఆదర్శం గా నిలిచే సేవలు చేస్తున్నారని సత్యాసాయి సెంట్రల్ ట్రస్టు కార్యకలాపాలను ఆయన ప్రస్తుతించారు
సత్యసాయి శతజయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 20 వేల మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రారంభించింది. ఆ పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ బాలికలకు అందించారు. దేశంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఖాతాలతో 3.25 లక్షల కోట్లు జమ చేయించారని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.
Tags:    

Similar News