Delhi | AAP అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ ..

పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ముఖ్యమంత్రి అతిశీ మళ్లీ కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.;

Update: 2024-12-15 09:39 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 38 మంది పేర్లను ప్రకటించింది. ఇక పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ముఖ్యమంత్రి అతిశీ మళ్లీ కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆప్ .. మూడోసారి కూడా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా తమ సొంత నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలను నామినేట్ చేసింది. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రఘువీందర్ షోకీన్, ముఖేష్ కుమార్ అహ్లావత్ వరుసగా గ్రేటర్ కైలాష్, బాబర్‌పూర్, బల్లిమారన్, నాంగ్లోయ్ జాట్, సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి పోటీ చేయనున్నారు. 2020 ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలో 62 సీట్లను ఆప్ కైవసం చేసుకుని రాజధాని రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

అరవింద్‌కు పోటీగా సందీప్ దీక్షిత్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరితో పొత్తు ఉండదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనకు పోటీగా దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపనుంది. 2013, 2015లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కొడుకు సందీప్‌కి ఈ ఎన్నికలు చాలా కీలకం. రాజకీయ కుటుంబ వారసత్వాన్ని చాలా అవసరం కూడా.

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు AAP తన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన తర్వాత కేజ్రీవాల్ ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు. "ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి విశ్వాసం, సన్నద్ధతతో పోటీ చేస్తోంది. BJPలో ఎక్కడా అవి కనిపించవు. వారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేరు. వారి అజెండా ఒక్కటే ‘కేజ్రీవాల్‌ను తొలగించడం’. ఢిల్లీ అభివృద్ధి గురించి ఆప్‌కి స్పష్టమైన విజన్ ఉంది. పనిచేసి పెట్టేవారికే ఓటు వేయండి.’’ అని పేర్కొన్నారు.

షకుర్ బస్తీ నుంచి మాజీ మంత్రి సత్యేందర్ ..

AAP తొలి జాబితాలో 2022లో మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ షకుర్ బస్తీ నుంచి తిరిగి పోటీచేస్తున్నారు. కాగా ఉత్తమ్ నగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ భార్య పూజా బల్యాన్‌ను ఆప్ పోటీకి దింపింది. సాఫీగా ఉన్న రోడ్లను "హేమ మాలిని బుగ్గలతో" పోలుస్తూ నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య విమర్శలకు దారితీసింది. అనుభవజ్ఞులైన నాయకులు, కొత్త అభ్యర్థుల కలయికతో ఢిల్లీ అధికార పీఠాన్ని తామే దక్కించుకుంటామన్న నమ్మకం ఆప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. 

Tags:    

Similar News