ఉత్తరాఖండ్‌లో భారీ వరద - నలుగురి మృతి, పదుల సంఖ్యలో గల్లంతు

కొట్టుకుపోయిన హోంస్టేలు, హోటళ్లు;

Update: 2025-08-05 10:47 GMT

ఉత్తరాఖండ్‌(Uttarakhand) రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. గంగోత్రి‌లోని ధరాలీ గ్రామాన్ని వరద ప్రవాహం(floods) ముంచెత్తడంతో వందల సంఖ్యలో ఇళ్లు, హోటళ్లు ధ్వంసమయ్యాయి. పర్వత శ్రేణిలో క్లౌడ్ బరస్ట్(Cloudburst) కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ల్యాండ్ స్లైడ్ జరిగి వరద ప్రవాహం గ్రామం మొత్తాన్ని కప్పేసింది. ఈ షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ విపత్తులో నలుగురు చనిపోయారు. శిథిలాల కింద దాదాపు 10 నుంచి12 మంది సమాధి అయి ఉండవచ్చని గ్రామస్థుడు రాజేష్ పన్వర్ పీటీఐకి తెలిపారు. 20 నుంచి 25 హోటళ్ళు, హోమ్‌స్టేలు కొట్టుకుపోయి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మరో 60 మంది దాకా గల్లంతయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆర్మీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. 

Tags:    

Similar News