భారత్ విజేత అయినందుకే పాకిస్తాన్ అధికారులను ఆహ్వనించలేదా?

ఆతిథ్య దేశాన్ని అవమానించారన్నా మాజీ క్రికెటర్లు;

Update: 2025-03-10 13:18 GMT

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో భారత్ గెలిచిన తరువాత ఆతిథ్య పాకిస్తాన్ అధికారులు ఎవరూ వేదికపైకి రాకపోవడంపై వివాదం చెలరేగింది. ఐసీసీ కావాలనే పాక్ అధికారులను ఆహ్వానించకుండా అవమానించిందని ఆ దేశ మాజీ క్రీడాకారులు విమర్శలు గుప్పించారు.

టోర్నమెంట్ డైరెక్టర్ అయిన పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ వేదిక వద్ద ఉన్నారని, అయితే ఆయనను పక్కన పెట్టారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.

‘‘పీసీబీ ప్రస్తుత చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున దుబాయ్ వెళ్లలేకపోయారు. కానీ పీసీబీ సీఈఓను వేడుక కోసం పాకిస్తాన్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అహ్మద్ ను పంపారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత్ ట్రోఫి గెలిచిన తరువాత ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా ఆటగాళ్లకు పతకాలు, ట్రోఫిలు, జాకెట్లను అందజేశారు. కానీ పీసీబీ అధికారులు ఒక్కరూ కూడా పోడియం పైకి ఆహ్వనించలేదు.
ఛాంపియన్ ట్రోఫికు ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తానే. కానీ భద్రతా కారణాల వల్ల భారత్ అక్కడికి వెళ్లడానికి నిరాకరించింది. దాంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించింది. భారత్ ఆడే అన్ని మ్యాచ్ లు దుబాయ్ వేదికగానే నిర్వహించారు.
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఈ వివాదంపై స్పందించారు. పీసీబీ అధికారులు వేదికపై కి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
‘‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫిని గెలుచుకుంది. కానీ ఫైనల్ తరువాత పీసీబీ నుంచి ప్రతినిధి లేరని నేను గమనించాను. పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫి నిర్వహిస్తుంది. నాకు ఇది అర్థం కాలేదు’’ అని అక్తర్ తన ఎక్స్ అకౌంట్ లో పేర్కొన్నారు.
‘‘ట్రోఫిని అందించడానికి అక్కడ పీసీబీ నుంచి ఎవరూ లేరు. ఇది తెలుసుకోవడం శక్తికి మించిన పనే. బాగా ఆలోచించాల్సిన విషయం. అది ప్రపంచ వేదిక. అక్కడ పీసీబీ అధికారులు ఉండాలి. ఇది గమనించి బాధ పడ్డాను’’ అని వీడియోలో అక్తర్ అన్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆటగాళ్లకు తెల్లటి జాకెట్లను, మ్యాచ్ అధికారులకు పతకాలను బహూకరించారు. ఐసీసీ చైర్మన్ అయిన జై షా రోహిత్ కు ట్రోఫిని అందజేశారు. తరువాత అందరికీ పతకాలు ఇచ్చారు.
కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ ను ఓడించి కప్ ను మూడోసారి సొంతం చేసుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరకూ భారత్ నాలుగు వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించింది. రవీంద్ర జడేజా 49 ఓవర్ చివరి బంతికి బౌండరీ సాధించడంతో భారత్ సంబరాల్లో మునిగింది.
భారత్ వరుసగా రెండో ఐసీసీ ట్రోఫిని సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఏడాది వెస్టీండీస్ - అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ విజేతగా నిలిచింది. మొత్తం మీద మూడో సారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని ఇండియా ముద్దాడింది. ఇంతకుముందు 2002, 2013 లో భారత్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని గెలుచుకుంది. 2000, 2017 లో ఫైనల్ చేరిన ఓటమి పాలైంది.
Tags:    

Similar News