ఆటకు వీడ్కోలు పలికిన క్రికెట్ గబ్బర్

భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. 38 ఏళ్ల గబ్బర్ రెండు సంవత్సరాల క్రితం జట్టులో చోటు కోల్పోయాడు.

By :  491
Update: 2024-08-24 10:58 GMT

విచిత్ర వేషం. బోడి గుండు, వెనక పిలక, మీసాలు.. ఒకే తరహ స్టైల్ తో రకరకాల షాట్లు.. మైదానంలో క్యాచ్ పట్టగానే తొడగొట్టడం.. ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అభిమానులు గబ్బర్ అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి.. ఎస్ అతనే.. క్రికెటర్ శిఖర్ ధావన్. తాజాగా ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ ల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. 

38 ఏళ్ల ధావన్ మూడు ఫార్మాట్లలో 269 అంతర్జాతీయ మ్యాచ్‌లు (34 టెస్టులు, 167 ODIలు, 68 T20Iలు) ఆడారు. శనివారం క్రికెటర్ ధావన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రిటైర్ మెంట్ ప్రకటించారు. ధావన్ IPL లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడాడు.
6,000 ODI పరుగులు
డిసెంబర్ 10, 2022 తరువాత భారత్ తరఫున ధావన్ క్రికెట్ ఆడలేదు. చివరిసారిగా చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODIలో ఆడాడు. అక్టోబరు 20, 2010న విశాఖపట్నంలో జరిగిన ODIలో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ధావన్ 167 వన్డేల్లో 17 సెంచరీలు, 39 అర్ధసెంచరీలతో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో ఏడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 2,315 పరుగులు చేశాడు. అతని T20I కెరీర్‌లో, అతను 68 మ్యాచ్‌లలో 11 అర్ధ సెంచరీలతో 1,759 పరుగులు చేశాడు.
“కథలో ముందుకు సాగాలంటే పేజీని తిరగేయాలని ఒక సామెత ఉంది. అదే నేను చేయబోతున్నాను. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. నేను నా కెరీర్‌కు సమయం ఇస్తున్నప్పుడు, నేను దేశం కోసం చాలా ఆడినందున నేను ప్రశాంతంగా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, డీడీసీఏలకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాకు ఇంత ప్రేమను అందించిన అభిమానులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ధావన్ పేర్కొన్నాడు.
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, “అద్భుతమైన కెరీర్‌లో షికీకి అభినందనలు! భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతిదాని ద్వారా మీరు అదే ఆనందాన్ని పంచుతారని నాకు తెలుసు!" అన్నారు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, “మీకు మాత్రమే ఉత్తమమైనది షికీ పా. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు” అని అన్నారు. భారత మాజీ బ్యాట్స్ మెన్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “ఎప్పుడూ శిఖర్ ధావన్‌ని ఆరాధిస్తాను. తన విజయవంతమైన అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ మనోహరమైన చిరునవ్వుతో ఆడాడు. తన బరువు కంటే ఎక్కువ పంచ్ చేసిన వ్యక్తి నువ్వే. నీకు హ్యాట్సాఫ్!” అని వ్యాఖ్యానించారు.
భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాట్లాడుతూ, “పెద్ద టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనపరిచాడు. అతను ఎప్పుడూ ప్రశంసలను పొందలేదు. ఒక టీమ్ మ్యాన్. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. మీ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్.
“శిఖర్, అద్భుతమైన కెరీర్‌కు చాలా అభినందనలు. సెకండ్ ఇన్నింగ్స్ లో సాగే ప్రయాణంలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, @Sdhawan25. మీ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలో మీ నిరంతర విజయం, సంతోషం కలగాలని కోరుకుంటున్నా! ” అని భారత మాజీ ఆల్ రౌండర్ సునీల్ జోషి రాశారు.
ఐసీసీ టోర్నమెంట్ లో అంటే చాలు..
శిఖర్ ధావన్ ద్వైపాక్షిక సిరీస్ లో కంటే ఐసీసీ టోర్నమెంట్ అంటే చాలు చెలరేగి ఆడేవాడు. 2013 లో భారత్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి గెలవడంలో ధావన్ దే కీలక పాత్ర. 2015 లో ఆసీస్ లో జరిగి వన్డే ప్రపంచకప్ ముందు కూడా ధావన్ తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. కానీ ప్రపంచకప్ లో పాకిస్తాన్ జరిగిన తొలి మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించిన ధావన్, రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
అప్పటి వరకూ భారత్, సౌత్ ఆఫ్రికాతో ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలిసారిగా ఇండియా ప్రపంచకప్ లాంటి పెద్ద ఈవెంట్లలో దక్షిణాఫ్రికాను ఓడించిందంటే కారణం ధావనే బ్యాటింగే. అలాగే తన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై కూడా ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశారు. అందులో ఏకంగా 187 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Tags:    

Similar News