మీ సంతోషాన్ని మా దేశంలో సెలబ్రేట్ చేసుకోండి: ఆ టూరిస్టు కంట్రీ పిలుపు

దశాబ్ధం తరువాత టీమ్ ఇండియా ఐసీసీ ఈవెంట్ ను గెలిచింది. ఈ సందర్భంగా దేశంలో భారీగా విజయోత్సవాలు జరుపుకుంటోంది. ఇదే అదనుగా మాల్దీవులు మన దేశాన్ని బుట్టలో వేసుకుని..

Update: 2024-07-09 09:44 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు, భారతీయుల నుంచి ఛీత్కారానికి గురైన సంగతి తెలిసిందే. భారతీయ టూరిస్టులు ఎవరూ కూడా మాలే వైపు కూడా తొంగిచూడట్లేదు. దీంతో ఆ దేశ టూరిజం కుదేలైంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశం హోటల్ రంగం మన దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ భారతీయులు రండి అంటూ కాళ్ల వేళ్లా పడుతోంది.

తాజాగా 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ అందుకోవడంతో క్రికెటర్లను బుట్టలో వేసుకునే పనిలో పడింది. మీ విజయోత్సవాన్ని మాల్దీవుల్లో జరుపుకోండి అంటూ ఆ దేశ పర్యాటక సంఘం, దాని మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఆహ్వానించింది.

జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
"మాల్దీవుల మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC/ Visit Maldives) మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI) సహకారంతో భారత జాతీయ క్రికెట్ జట్టుకు సంయుక్తంగా ప్రత్యేక, బహిరంగ ఆహ్వానాన్ని అందించింది" అని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
MMPRCకి చెందిన CEO, మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం షియురీ, MATI సెక్రటరీ జనరల్ అహ్మద్ నజీర్ మాట్లాడుతూ, గత వారం గురువారం భారతదేశానికి తిరిగి వచ్చిన జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. లక్షలాది మంది మద్దతుదారులతో కూడిన విజయ పరేడ్‌కు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ, ముంబై రెండింటిలోనూ భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు దీనిని స్వాగతించారు.
"మీకు ఆతిథ్యం ఇవ్వడం, చిరస్మరణీయమైన క్షణాలు పంచుకోవడం, విశ్రాంతి, బెస్పోక్ అనుభవాలతో నిండి ఉండేలా చూసుకోవడం మాకు గౌరవంగా ఉంటుంది" అని షియురీ, నజీర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. మాల్దీవులు- భారతదేశం మధ్య బలమైన, దీర్ఘకాలిక సాంస్కృతిక, క్రీడా సంబంధాలను కూడా ఈ ఆహ్వానం హైలైట్ చేస్తుందని వారు చెప్పారు.
"భారత క్రికెట్ జట్టును స్వాగతించడం, వారి విజయానందంలో పాలుపంచుకోవడం మాల్దీవులకు గొప్ప గౌరవం" అని షియురీ అన్నారు. "మేము వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము, వారి విజయోత్సవ వేడుకల శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడానికి వారికి సరైన సెట్టింగ్‌ను అందజేస్తున్నాము" అని ఆయన చెప్పారు.


Tags:    

Similar News