చివరి టెస్ట్ ఆడకుండానే రిటైర్ అయిన షకీబ్?

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టెస్ట్ తాను ఆడితే చివరి టెస్ట్ అని ఇప్పటికే ప్రకటించాడు. అయితే దేశంలో..

By :  491
Update: 2024-10-20 07:50 GMT

అతనో ఆటగాడు.. దేశం తరఫున అనేక మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టు ఎన్నో సార్లు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ప్రపంచంలోని గొప్ప ఆల్ రౌండర్లలో ఒకటిగా పేరుపొందాడు. తన దేశంలోనే కెరీర్ ముగించాలనుకున్నాడు. దేశంలో జరిగిన తిరుగుబాటు ఆ ఆటగాడికి పెద్ద అడ్డంకిగా మారింది.దేశంలో తను అడుగుపెట్టడంపై నిరసనలు చెలరేగడంతో రిటైర్ మెంట్ ప్రణాళికను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ దేశం బంగ్లాదేశ్ కాగా, ఆ ఆటగాడు షకీబ్ అల్ హసన్.

దేశంలో తిరుగుబాటు జరిగి హసీనా ప్రభుత్వం కూల్చివేసిన తరువాత బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ పై అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే తాత్కలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత దక్షిణాఫ్రికా తో జరిగే తొలి టెస్ట్ లో ఆడటానికి సిద్ధమయ్యాడు. అయితే దేశంలో మరోసారి నిరసనలు రావడంతో షకీబ్ అల్ హసన్ తన టూర్ ను రద్దు చేసుకున్నాడు.
ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ జట్టులో మొదటి టెస్ట్ కోసం చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఇది తన చివరి టెస్ట్ అని ప్రకటించాడు. అయితే నిరసనకారులు మాత్రం షకీబ్ దేశంలో అడుగుపెట్టేందుకు వీలులేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. తమను తాము “మీర్‌పూర్ ఛత్రో జనతా”గా ప్రకటించుకున్న ఒక బృందం, స్టేడియంలో షకీబ్ కనిపించడాన్ని నిరసిస్తామని BCBకి తెలియజేసింది. మరోవైపు షకీబ్ మద్దతుదారులు శుక్రవారం ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
షకీబ్ బంగ్లాదేశ్‌కు వస్తే తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు, ఆగస్టు 5 నుంచి అవామీ లీగ్ నాయకులను అరెస్టు చేశారు. షకీబ్ అంతకుముందు తన స్వస్థలం మగురా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అశాంతి సమయంలో జరిగిన హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 147 మందిలో ఆయన ఒకరు.
బంగ్లాదేశ్ ఇటీవలి భారత పర్యటన సందర్భంగా, షకీబ్ కాన్పూర్ టెస్ట్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు, స్వదేశీ ప్రేక్షకుల ముందు తన చివరి టెస్ట్ ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు.
అయినప్పటికీ, అతను బంగ్లాదేశ్‌లో తన రాజకీయ అనుబంధాల కారణంగా, నిరసనల సమయంలో అతని ప్రమేయం కారణంగా బంగ్లాదేశ్‌లో తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ లో నిరసనల కారణంగా దాదాపు వెయి మంది మరణించారు.


Tags:    

Similar News