దయచేసి ఇక నుంచి నన్ను అలా పిలవద్దు: కమల్ హసన్

తనకు సినీ కెరియర్ లో వచ్చిన అన్ని బిరుదులను త్యజిస్తున్నట్లు ప్రఖ్యాత తమిళనటుడు కమల్ హసన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.

By :  491
Update: 2024-11-11 07:42 GMT

సినీ హీరోలను అభిమానులు ముద్దుగా వారి బిరుదులతో పిలుస్తూ ఉంటారు. కానీ ప్రఖ్యాత తమిళ నటుడు, కమల్ హసన్ కు కూడా ఇలాంటి బిరుదులే ఉన్నాయి. కమల్ ను అందరూ ‘యూనివర్శల్ హీరో’ లేదా ‘ ఉలగ నాయగన్’ అని సంబోధిస్తారు.

కానీ ఇక నుంచి తనను అలాంటి బిరుదులతో పిలవొద్దని, అన్ని బిరుదులను త్యజిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అభిమానులు ఇక నుంచి కమల్ హాసన్ లేదా కేహెచ్ అని పిలవాలని కోరాడు. సౌత్ ఇండియాలో పాపులర్ నటుడు అయిన కమల్.. 2018 లొ మక్కల్ నీది మయ్యుం అనే పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అభిమానులు ఎప్పుడు బిరుదులతో పిలవడం పై కృతజ్ఞత భావంతో ఉన్నానని చెప్పారు.

"ప్రజలు, గౌరవనీయమైన సహోద్యోగులు, అభిమానులచే గుర్తించబడిన ఇటువంటి ప్రశంసలు ఎల్లప్పుడూ గౌరవనీయంగా ఉంటాయి. మీ ప్రేమను నాపై చూపించడంతో నేను నిజంగా కదిలిపోయాను" అని నటుడు ఒక ప్రకటనలో తెలిపారు. కళాకారులు కళ కంటే ఉన్నతంగా ఉండకూడదనేది తన వినయపూర్వకమైన నమ్మకమని అగ్ర నటుడు అన్నారు. 

'నన్ను కమల్ హాసన్, కమల్ లేదా KH అని పిలవండి'
" నేను స్థిరంగా ఉండటానికి ఇష్టపడతాను. నా అసంపూర్ణతల గురించి, వాటిని మెరుగుపరచడం నా కర్తవ్యం అని నిరంతరం భావిస్తాను. చాలా రోజుల ఆలోచనల తరువాత, అటువంటి బిరదులు త్యజించాలని నిర్ణయించుకున్నాను" అని కమల్ అన్నారు.
తన అభిమానులు, సినీ ప్రముఖులు, మీడియా, పార్టీ కార్యకర్తలు, “తోటి భారతీయులు” తనను “కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కెహెచ్” అని పిలవాలని ఆయన అభ్యర్థించారు. మరో తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ కూడా చాలా సంవత్సరాల క్రితం తన గురించి ప్రస్తావించేటప్పుడు “తల” టైటిల్‌ను తొలగించమని అభిమానులను కోరినట్లు తెలిసింది. తాజాగా కమల్ కూడా ఈ జాబితాలో చేరారు.


Tags:    

Similar News