న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ కు అనుభవం లేదు: క్రీడా విశ్లేషకులు
తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశం?;
By : Praveen Chepyala
Update: 2025-03-02 08:32 GMT
ఛాంపియన్స్ ట్రోఫి గ్రూపు మ్యాచ్ చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు భారత్ తన చివరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా తలపడబోతోంది. రెండు జట్లు ఇప్పుటికే తమ సెమీస్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నప్పటి ఈ మ్యాచ్ ను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ మ్యాచ్ గెలిచిన వారు గ్రూప్ టాపర్ గా లీగ్ దశను ముగిస్తారు. ఈ చివరి లీగ్ మ్యాచ్ పై సుమన్ సీ రామన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
రోహిత్ ఆడతాడా?
కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడంతో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో గాయం కారణంగా ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే.
ఒకవేళ రోహిత్ లేకపోతే జట్టు సమతూకం దెబ్బతింటుందని సుమన్ అభిప్రాయపడ్డారు. ‘‘న్యూజిలాండ్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది, వారికి ఇక్కడ తగినంత అనుభవం లేదు’’ అన్నారు.
యంగ్ బౌలర్ అయిన విల్ ఓ రూర్కే నేతృత్వంలోని బృందానికి కాస్త అనుభవం తక్కువ ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ ఈ అనుభవరాహిత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ‘‘ మ్యాట్ హెన్రీ, కెప్టెన్ మిచెల్ శాంటర్న్ కు మాత్రమే అనుభవం ఉంది. వీరు భారత బ్యాటింగ్ లైనఫ్ ను ఎలా ఆపగలదు’’ అని ఆయన అన్నారు.
కెప్టెన్ గా గిల్..
ఒకవేళ రోహిత్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోతే వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది అతనికి కెప్టెన్ గా తొలి వన్డే. సుమన్ దీనిని విశ్లేషిస్తూ.. ఇది ఎలాంటి ఒత్తిడి తీసుకురాదని అభిప్రాయపడుతున్నారు. ‘‘
ఇది కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాదు. మనం ఓడిపోయిన సెమీస్ బెర్త్ లో మార్పు రాదు. ’’ అన్నారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పు తీసుకువస్తాడనే విషయంలో గిల్ పై మాత్రం ప్రభావం ఉంది.
సెమీ ఫైనల్ ప్రత్యర్థి ఎవరూ?
భారత్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానప్పటికీ సెమీస్ లో ఎవరిని ఎదుర్కోవాలో నిర్ణయించే మ్యాచ్ కూడా. ‘‘ భారత్ సెమీస్ లో దక్షిణాఫ్రికా ను ఎదుర్కోవాలా? ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలా? అని ఈ మ్యాచ్ గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి’’ అన్నారు. కానీ భారత్ సెమీస్ లో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడానికి సిద్దంగా ఆసక్తిగా ఉందన్నారు.
రిషబ్ పంత్ గేమ్ ఛేంజర్?
రోహిత్ గైర్హాజరీ అయితే తుది జట్టులోకి రిషభ్ పంత్ వస్తాడని తెలుస్తోంది. ‘‘ మిడిల్ ఆర్డర్ లో మంచి హర్డ్ హిట్టర్ కావాలని అనుకుంటే పంత్ బరిలోకి దింపుతారు. కానీ పంత్ ఫామ్ ఈ మధ్యకాలంలో సరిగా లేదు’’ అని సుమన్ అన్నారు.
అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి..
పేసర్ మహ్మాద్ షమీ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ వస్తాడని కూడా అంచనాలు ఉన్నాయి. ‘‘బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ వచ్చాడు. ఇప్పడు సింగ్ రీప్లేస్ మెంట్ ను చేసే అవకాశం కనిపిస్తొంది.’’ అని సుమన్ చెప్పారు. ప్రస్తుతం షమీ స్థానంలో మాత్రం సింగ్ రావడం ఖాయం అన్నారు.
న్యూజిలాండ్ టాప్ ఆర్డర్..
న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ మంచి ఫామ్ లో ఉన్నారు. డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నారు. భారత్ కు కూడా అనుభవం లేని బౌలింగ్ లైనప్ ఉందని వీటిని వారు ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చాలా ప్రొఫెషనల్ ప్లేయర్స్, వారు సులువుగా తమ వికెట్లను ఇవ్వరు’’ అని విశ్లేషించారు.
ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. న్యూజిలాండ్ కు మంచి నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారు. ముఖ్యంగా మైదానంలో గ్లెన్ ఫిలిప్స్ చాలా వేగంగా కదులుతుంటాడనే పేరుంది. ప్రత్యర్థికి చెందిన విలియమ్సన్ కు మంచి అనుభవం ఉందన్నారు.
టాస్ గెలిస్తే.. బ్యాటింగ్.. బౌలింగ్
టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలా? బౌలింగ్ ఎంచుకోవాలా? అనేది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. దుబాయ్ లో జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఛేజింగ్ చేసి గెలిచింది. ఇక్కడ మన జట్టు బ్యాటింగ్ లైనప్ మంచి ప్రభావం చూపిస్తుందని అన్నారు.
ఇండియా బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు స్కోర్ బోర్డు పై ఉంచాలన్నారు. పిచ్ సహకరిస్తే అంతకంటే ఎక్కువగా సాధించే అవకాశం ఉందన్నారు.
ప్లేయింగ్ ఎలెవన్ లో..
గిల్( కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లి, అయ్యార్, పంత్, పాండ్యా, జడేజా, పటేల్, హర్షిత్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఈ మ్యాచులో భారత్ విజయకాశాలు 65 ఉన్నాయని అంచనావేశారు. న్యూజిలాండ్ బౌలింగ్ అనుభవం లేకపోవడమే కారణమని అన్నారు. పార్ట్ టైమ్ స్పిన్నర్లు కనీసం 20 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉందని , దీనిని మనవాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉందని అన్నారు.
న్యూజిలాండ్ ప్రారంభ ఓవర్లలో ఎక్కువ వికెట్లు తీస్తే దానికి అడ్వాంటేజ్ గా మారుతుందని అన్నారు. మొత్తానికి ఇరుజట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా ఉంటందున్నారు.