షూటర్‌కు చేజారిన మూడో పతకం

భారత షూటర్ మను భాకర్ గురి తప్పింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి పెట్టిన భాకర్‌పై భారత్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఆమెకు మరో మెడల్ ఖాయమని అందరూ భావించారు.

Update: 2024-08-03 08:49 GMT

భారత షూటర్ మను భాకర్ గురి తప్పింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి పెట్టిన భాకర్‌పై భారత్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఆమెకు మరో మెడల్ ఖాయమని అందరూ భావించారు. అయితే శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో మూడో పతకం చేజారింది. హంగేరియన్‌ కాంస్య పతక విజేత వెరోనికా మేజర్‌ చేతిలో ఓడిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షూటర్ మను భాకర్ పేరు రికార్డుల్లోకెక్కింది. భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఒక వ్యక్తిగత కాంస్యం, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News