సచిన్ చేయి విడిచిపెట్టడానికి నిరాకరించిన కాంబ్లీ..

రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలుసుకున్నారు.

By :  491
Update: 2024-12-05 10:13 GMT

భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రముఖ కోచ్ రమాకాంత్ అచ్రేకర స్మారక కార్యక్రమంలో అతను పాల్గొనడంతో కాంబ్లీ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ప్రోగ్రాంకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం హాజరయ్యాడు. అందులో భాగంగా సచిన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన కాంబ్లీ, మాస్టర్ బ్లాస్టర్ చేయి విడిచిపెట్టడానికి నిరాకరించాడు.

ఇందులో కాంబ్లీ చాలా బలహీనంగా, కనీసం నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో కనిపించాడు. ఇది చాలామంది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆరోగ్యం గురించి చాలామంది వాకబు చేస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ వీడియో చాలా వైరల్ గా మారాయి.
ఒకరు ఆకాశం వైపు.. మరో పాతాళం వైపు..
ముంబై స్కూల్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్- వినోద్ కాంబ్లీ అనేక రికార్డులు నెలకొల్పారు. తరువాత ఇద్దరు జాతీయ జట్టులోకి అడుగుపెట్టారు. అయితే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రయాణం అత్యున్నత దిశలోకి వెళ్లిపోగా, కాంబ్లీ పతనం అంతే వేగంగా సాగింది.
మాస్టర్ బ్లాస్టర్ తన క్రమశిక్షణతో తన కెరీర్ ను తీర్చిదిద్దుకోగా, విపరీత ప్రవర్తనతో కాంబ్లీ తన కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. తరువాత క్రికెట్ నుంచి దూరమయ్యాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
అనేక సార్లు పునరావాసం..
మాజీ ఫస్ట్-క్లాస్ అంపైర్ మార్కస్ కౌటో.. ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కాంబ్లీకి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అతడిని ఆరోగ్యం పాడవడంతో దాదాపు 14 సార్లు పునరావాస(రి హబిలిటేషన్) కేంద్రాలకు తరలించారు.
"మూడుసార్లు మేము అతనిని వాసాయిలోని పునరావాసానికి తీసుకెళ్లాము," అని అతను చెప్పాడు. కూటో ఈ ఏడాది ఆగష్టులో బాంద్రాలోని కాంబ్లీ నివాసానికి వెళ్లినప్పుడు అతను నడవడానికి కూడా కష్టపడుతున్నాడు. కాంబ్లీ వీధిలో నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మద్యానికి బానిస..
కాంబ్లీ క్రికెట్ కు దూరమైన తరువాత మద్యానికి బానిస అయ్యాడు. తరువాత అతని విపరీత ప్రవర్తనతో అనేక మంది క్రికెట్ స్నేహితులు దూరమయ్యారు. ఎవరూ సాయం చేయలేకపోయారు.
వరల్డ్ కప్ హీరోలు..
కాంబ్లీ పరిస్థితి చూసిన 1983 వరల్డ్ కప్ హీరోలు అతనికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ బల్వీందర్ సింగ్ సంధు ప్రకారం, దిగ్గజ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కాంబ్లీకి సాయం చేయాలనుకున్నాడు. కానీ కాంబ్లీ ఆర్థిక సాయం పొందడానికి ముందు పునరావాస కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని స్పష్టం చేశాడు.
అక్కడ ఎంత కాలం చికిత్స కొనసాగిన బిల్లు చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని సంధూ చెప్పారు. 1983 ప్రపంచ కప్ హీరోలు గతంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో మాజీ ఓపెనర్, కోచ్ అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి కలిసి వచ్చారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టులో నేటికీ ఉన్న గాఢమైన స్నేహభావానికి ఇది నిదర్శనం.



Tags:    

Similar News