టూ వికెట్స్ డౌన్.. ఇండియా చెత్త రికార్డ్..!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి టీమిండియా చెత్త రికార్డ్‌ను సృష్టించింది.;

Update: 2025-03-09 09:59 GMT

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న న్యూజిలాండ్ టీమ్.. రవీంద్ర, యంగ్‌తో మ్యాచ్‌ను ప్రారంభంచింది. మ్చాచ్‌కు వీరిద్దరు శుభారంభం ఇచ్చారు. వారిద్దరు కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని వరుణ్ చక్రవర్తి 51 పరుగులు దగ్గర బ్రేక్ చేశాడు. ఇప్పటికే రెండు సార్లు రెండు క్యాచ్‌లు మిస్ అయ్యాయి. ఒకటి షమి మిస్ చేయగా, మరొకటి శ్రేయాస్ అయ్యర్ మిస్ చేశాడు. ఆ తర్వాత వరుణ్.. తన స్పిన్‌తో యంగ్‌ను ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. దీంతో విలియంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మళ్ళీ ఆట గాడిన పడుతుందగా రవింద్రను కుల్‌దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. రవీంద్ర 29 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి టీమిండియా చెత్త రికార్డ్‌ను సృష్టించింది. క్రికెట్ చరిత్రలో ఏ దేశ జట్టు ఇటువంటి రికార్డ్ చేయలేదు. అదే వరుసగా టాస్ ఓడిపోవడం. టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్‌తో కలిసి వరుసగా 15సార్లు టాస్ ఓడిపోయింది. ఈ లిస్ట్‌లో టీమిండియా తర్వాత నెదర్లాండ్స్ ఉంది. ఆ దేశం జట్టు వరుసగా 11సార్లు టాస్ ఓడిపోయింది. నెదర్లాండ్స్ 2011-202 మధ్య ఈ రికార్డు చేసింది. దానిని ఇప్పుడు రోహిత్ సేన బ్రేక్ చేసింది.

అయితే ఈ పదిహేన్ సార్లు ఓడిన టాస్‌లో రోహిత్ పేరిట 12సార్లు ఉండగా, మరో మూడు సార్లు కేఎల్ రాహుల్ టాస్‌ను ఓడాడు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధికంగా టాస్ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డ్‌ను రోహిత్ సమం చేశారు.

Tags:    

Similar News