ఐసీసీ వరల్డ్ కప్ విజేత భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో భారత్ గెలిచి కప్ ను చేజిక్కించుకుంది. భారత్ న్యూజిలాండ్ పై ఘన విజయాన్ని సాధించింది. 25 ఏళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్ తో తలపడింది.;
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను ఓడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి కప్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది (Ind vs Nz). రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (83 బంతుల్లో 76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఛేజింగ్‌ను సులభం చేశాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29), కేఎల్ రాహుల్ (34) రాణించడంతో టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది (Champions Trophy).
252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (31)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించాడు. టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంట్నర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (1)ని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్.. రచిన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు.
ఆ తర్వాత అయ్యర్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా (18) అవుటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్), జడేజా (9 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, బ్రేస్‌వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర, జేమీసన్ ఒక్కో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (63), బ్రేస్‌వెల్ (53), రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) కీలక పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు.
కివీస్ జట్టుకు ఓపెనర్లు యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభాన్ని అందించారు. పది ఓవర్లకే న్యూజిలాండ్ 69 పరుగులు చేసింది. మొదటి మూడు ఓవర్లలో పది పరుగులు చేసిన న్యూజిలాండ్, నాలగో ఓవర్‌లో 16 పరుగులు, ఐదో ఓవర్‌లో 11 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్‌లో యంగ్ అవుట్ కావడంతో భారత బౌలర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మొదటి పది ఓవర్ల వరకు రచిన్ రవీంద్ర భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మొదటి పవర ప్లేలో పది ఓవర్లకు ఒక వికెట నష్టానికి 69 పరుగులు చేసిన న్యూజిలాండ్ 11వ ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. 13వ ఓవర్‌లో కేన్ విలయమ్‌సన్‌ను కుల్దీప్ పెవిలయన్ పంపాడు. భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేసి వెంటవెంటనే వికెట్లు తీసి కివీస్‌ను 251 పరుగులకు కట్టడి చేశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది.
భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా అవలీలగా న్యూజిలాండ్ పై గెలిచింది.
80 కోట్లమంది వీక్షకులు...
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యధికంగా అనుసరించే రెండవ ఆట క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో 104 సభ్య దేశాలు , ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు మరియు 3 కోట్ల మంది నమోదిత ఆటగాళ్ళు ఉన్నారు.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ని సుమారు 80 కోట్ల మందికి పైగా ప్రజలు చూస్తున్నారు. లక్షలాది మంది యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు ఈ ఆటను చూస్తున్నారు.
క్రికెట్ వ్యూయర్‌షిప్ గణాంకాలు విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రికెట్ చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16 నుండి 69 సంవత్సరాల వయస్సున్నవాళ్లు వీక్షకుల్లో ఎక్కువగా ఉన్నారు. ఓ అంచనా ప్రకారం సుమారు వంద కోట్ల మంది వివిధ మాధ్యమాల ద్వారా క్రికెట్ ను ఆస్వాదిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిమానులు 34 ఏళ్ల వారు, వీరిలో 61% మంది పురుషులు, 39% మంది మహిళలు.
మొత్తం మీద క్రికెట్ ఓ పెద్ద వినోద వనరుగా మారింది.
న్యూజిలాండ్ ను కట్టడి చేసిన తీరు ఇలా...
ఛాంఫియన్స్ ట్రోపీలో ఇప్పటివరకు ఆడిన అన్నింటిలో భారత్ గెలుస్తూ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో ఈజీగా గెలుస్తామనే నమ్మకాన్ని క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నప్పటకీ న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనఫ్ చూస్తే ఫైనల్స్‌లో గెలుపు అవత ఈజీ కాదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్‌సన్, రచిన్ రవీంద్ర సెంచరీలతో అదరగొట్టారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రస్తుత ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర అవుట్ కావడం భారత్‌కు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. విలియమ్‌సన్ పెవిలియన్‌కు చేరడంతో న్యూజిలాండ్‌ను 251 పరుగులకు కట్టడి చేశారు.
కుల్దీప్ అదుర్స్...
భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొట్టారు. తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్రను అవుట్ చేసిన కుల్దీప్, తాను వేసిన రెండో ఓవర్ రెండో బంతికి మరో డేంజరస్ బ్యాట్స్‌మెన విలియమ్‌సన్ పెవిలియన్ చేరడంతో భారత అభిమానులు పండుగ చేసుున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్‌సన్ అవుట్ కావడంతో భారత్ కొంత ఊపిరిపీల్చకున్నట్లైంది.