భారత క్రికెట్ ప్రేమికులకు పండగ ఇంగ్లాండ్ తో సిరీస్!

ఛాంపియన్స్ ట్రోఫీకి కర్టెన్ రైజర్ రెడీ. కొందరు ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్. ఎవరు నిలబెట్టుకుంటారో చూడాలి. రివేంజ్ తీర్చుకోవలన్న కసితో ఇంగ్లీష్ ప్లేయర్స్.;

Update: 2025-01-21 11:37 GMT

భారత జట్టు రేపటి నుంచి కలకత్త లో మొదలయ్యే మొదటి మ్యాచ్ తో మరోసారి ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడబోతుంది. బజ్బాల్(bazz ball) వ్యూహంతో ముందుకు దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ జట్టుతో, మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు తలపడుతున్న ఈ మ్యాచ్ కోల్ కత్త లోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రేక్షకులకు కనువిందు చేయబోతుంది. వచ్చే నెల దుబాయ్, పాకిస్తాన్ సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కు ఇది కర్టెన్ రైజర్ అనొచ్చు..ఈ సంవత్సరం ఆరంభంలోనే అతిపెద్ద టోర్నమెంట్ " ఛాంపియన్స్ ట్రోఫీ" నిర్వహించడం అన్నది ప్రేక్షకులకు పండగే

ఈ టి20 మ్యాచ్లలో ఆడుతున్న జట్టులో కొంతమంది ఆటగాళ్లకు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఇండియా జట్టు ఆటగాడు మొహమ్మద్ షమీ ఈ మ్యాచ్ తో పునరాగమనం చేస్తున్నాడు. షమీ కి ఇది చాలా ముఖ్యమైన సీరియస్, అతనితోపాటు హర్ష దీప్, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ లకు కూడా ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ చాలా ముఖ్యమైనది.

టి20 లలో భారత జట్టు ప్రదర్శన బావుంది

ముందుగానే చెప్పుకోవాల్సి వస్తే భారత జట్టు ఇంతవరకు ఇంగ్లాండ్ తో ఆడిన 24 మ్యాచ్ల్ లలో 13 గెలిచి భారత ముందంజలో ఉంది. అయితే గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో 4-1 తేడాతో ఓడిన భారత్ పేలవమైన ప్రదర్శన గురించి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది.. ఇంతవరకు మొత్తం 242 టి20 మ్యాచులు ఆడి 160 గెలిచిన భారత జట్టు టి20 ప్రదర్శన బాగానే ఉంది. భారత్ జట్టు బార్బడోస్ లో ట్రోఫి గెలిచిన తర్వాత ఒక సీరిస్ కూడా ఓడిపోలేదు. గత సంవత్సరం టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత జట్టు దే పై చేయి లాగ కనబడుతుంది. మానసికంగా అది కొంతవరకు ఇంగ్లాండ్ జట్టుపై ప్రభావం చూపించవచ్చు

పేస్ బౌలర్ షమీకి తోపాటు ఇతరులకి కూడా ఒక మంచి అవకాశం

దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆడనున్న షమీకి ఇది చాలా ముఖ్యమైన సీరిస్. ఎందుకంటే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫి కోసం భారత జట్టు ను ఐసీసీ ప్రకటించింది. అందులో కూడా షమీకి స్థానం ఉంది. షమీ చివరిసారిగా 2023 ప్రపంచ కప్ ఫైనల్ తో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మడమ గాయం వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చి భారత జట్టు నుంచి వైదొలిగాడు. రంజీ ట్రోఫీలో, విజయ్ హజారే ట్రోఫి వంటి దేశవాళీ టోర్నమెంట్లలో ఆడినప్పటికీ మళ్లీ మోకాలు నొప్పి తిరగబెట్టడంతో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లలేకపోయాడు దాంతో భారత జట్టు పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది ఆస్ట్రేలియాతో పేలవమైన ప్రదర్శనకు ఇది కొంతవరకు కారణం. ఇప్పుడు ఈ మ్యాచ్ లను షమీ ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకున్నప్పటికీ, చాంపియన్ ట్రోఫి లో 11 మందిలో స్థానం సంపాదించడం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అలాగే స్పిన్నర్ అక్సర్ పటేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు కూడా ఇది చాలా ముఖ్యమైన సిరీస్. వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ లకు కూడా ఇది చాలా ముఖ్యమైన సీరిస్. ఐసీసీ చాంపియన్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో, నితీష్ రెడ్డి కు స్థానం దక్కలేదు. అలాగే సూర్య కుమార్ యాదవ్ కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దొరకకపోవడం ఆశ్చర్యకరం. అదే పరిస్థితిలో వికెట్ కీపర్ సంజు శామ్సన్ ఉన్నాడు.

ఆశ్చర్యపరిచిన జట్టు కూర్పు

ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో సమతుల్యత ఉన్నప్పటికీ, కొంతమంది ఆటగాళ్లను ఒక పెద్ద టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ ఎంపిక చేయకపోవడం కొంత ఆశ్చర్యకరమే. విధ్వంసకరమైన ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యకరమే. బహుశా, వారిని ఒక పెద్ద టోర్నమెంట్ కు అట్టీ పెట్టినట్టు అనిపిస్తుంది. అదే విధంగా వికెట్ కీపర్ జితేష్ శర్మ స్థానంలో కొత్త ఆటగాడు ధ్రువ్ జురేల్ ను ఎంపిక చేయడం కూడా, అర్థం కాని అంశం. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లేడు.

బదులు తీర్చుకోవాలి అనుకుంటున్న ఇంగ్లాండ్ జట్టు

ఇక ఇంగ్లాండ్ జట్టు గురించి చూస్తే జోష్ బట్లర్ ఆ జుట్టుకు ప్రధాన బలం. ఇంతకుముందు ఐపీఎల్ లో బట్లర్ ప్రదర్శన చాలా బాగుంది. జాకబ్ బెతెల్, జామి స్మిత్ వంటి వారికి, ఛాంపియన్ ట్రోఫీ లో స్థానం సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశం.

వెస్టిండీస్ లోని గయానాలో జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టు భారత చేతిలోనే ఓడిపోవడం ఇంగ్లాండ్ మర్చిపోకపోవచ్చు. బదులు తీర్చుకోవడానికి ప్రణాళికలు రచించి ఉండవచ్చు. మరింత కసిగా ఆడవచ్చు

క్రమశిక్షణ, ఐక్యత.. జట్టుకు అవసరం

భారత జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన తర్వాత బీసీసీఐ 10 సూత్రాల ప్రణాళికను ఆటగాళ్ల కోసం రూపొందించింది. అందులో ముఖ్యమైనది ఆటగాళ్లందరూ ఒకే బస్సులో ప్రయాణం చేసి స్టేడియం చేరుకోవడం. వ్యక్తిగత వాహనాలను అనుమతించకపోవడం. అందరూ కలిసి ఒకే చోట ఉండాలన్నది కూడా బీసీసీఐ రూపొందించిన నిబంధన. క్రమశిక్షణ, ఐక్యత, ఉత్తమ స్థాయి ప్రదర్శన, పాజిటివ్ దృక్పథం జట్టులో పెంపొందించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావించడమే దీనికి కారణం

Tags:    

Similar News