ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి: రేపు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్

రేపు సూపర్ సండే క్రికెట్ వార్ పై అభిమానుల ఆసక్తి;

Update: 2025-02-22 06:26 GMT

రేపు మధ్యాహ్నం నుంచి దేశంలోని రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోతుంది. అప్రకటిత కర్ప్యూ కనపడుతుంది. జనమంతా టీవీల ముందు కూర్చుని కనిపిస్తారు. ఎందుకంటే రేపు దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ సేన, తన ఛాంపియన్స్ ట్రోఫి ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూస్తే భారత్ తేలికగా విజయం సాధించే అవకాశం ఉంది.
మెన్ ఇన్ బ్లూ తాను ఆడిన చివరి నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించింది. పాకిస్తాన్ ప్రయాణం మరీ అంత గొప్పగా ఏం లేదు. స్వదేశంలో జరిగిన ట్రోఫిలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. తన తొలి మ్యాచ్ లో తిరిగి న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో చిత్తయింది. దీనితో పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండిపోయింది. ఇక్కడ కూడా దాయాదీ ఓటమి పాలైతే సెమీస్ ఆశలు గల్లంతు కావాల్సిందే.
భారత్ కు లాభం..
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, భారత్ ఏడు వన్డేలు ఆడగా, అన్నింటా విజయం సాధించింది. ఇందులో ఆరు సాధారణ మ్యాచ్ లు, ఒక ఫైనల్ ఉన్నాయి. ఏడు సంవత్సరాల కింద ఆఘ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.
దుబాయ్ లో పాకిస్తాన్ తో జరిగిన వన్డే రెండు మ్యాచులలో భారత్ విజయం సాధించింది. 2018 లో ఆసియా కప్ లో రెండు సార్లు భారత్ చేతిలో ఓటమి పాలైంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 2009 నుంచి వన్డేలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత తొలిసారిగా 2018 లో ఆసియా కప్ లో ఆడింది. తరువాత ఫైనల్ లో కూడా గెలిచి ట్రోఫిని అందుకున్నారు.
ఆసియా కప్ టైటిల్ కైవసం..
2018 లో ఇదే వేదికపై జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో రోహిత్ సేన చివరి బంతికి బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. మరోసారి పాకిస్తాన్ పై విజయాన్ని నమోదుచేసి ఆధిపత్యం ప్రదర్శించాలని భారత అభిమానులు కోరుతున్నారు.
భారత రికార్డు
ఆడినవి 7, గెలిచినవని 6, టై అయినది 1,
బంగ్లాదేశ్ తో జరిగిన మూడు మ్యాచులను గెలుచుకున్నారు.
పాకిస్తాన్ తో 2 ఆడి, రెండూ గెలిచారు.
హాంకాంగ్ తో ఒకటి ఆడి గెలిచారు.
ఆప్ఘనిస్తాన్ తో ఒకటి ఆడగా, ఒకటి టైగా ముగిసింది.


Tags:    

Similar News