నేను అతిగా బోధ చేయను కానీ.. జస్ప్రీత్ భూమ్రా

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో యార్కర్లను ఫర్పెక్ట్ గా సంధించే ఏకైక బౌలర్ జస్ప్రీత్ అని ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ అన్నారు. కానీ భూమ్రా..

Update: 2024-06-01 10:34 GMT

కొత్త కుర్రాళ్లకు మార్గదర్శిగా మాత్రమే ఉంటానని అతిగా బోధ చేయనని, అడిగితే మాత్రం సాయం చేస్తానని భారత స్పీడ్ గన్ జస్ ప్రీత్ భూమ్రా అన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టులో ఉన్న పేసర్లలో భూమ్రానే అనుభవజ్ఞుడు, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ కు ఈ ఫార్మాట్లో గొప్ప రికార్డు లేకపోవడంతో మేనేజ్ మెంట్ భూమ్రా పైనే ఆశలు పెట్టుకుంది.

T20 ప్రపంచ కప్ కోసం ICC అధికారిక వెబ్‌సైట్‌లో బుమ్రా మాట్లాడుతూ, "మీరు జూనియర్లకు అతిగా బోధించడానికి ప్రయత్నించకండి. అది నేను నేర్చుకున్న విషయం. " సాయం అవసరమైనప్పుడల్లా, నేను వారి స్వంత ప్రశ్నలను అడగడానికి అనుమతిస్తాను. ఎందుకంటే మీరు ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు," అని భూమ్రా చెప్పాడు.
ఎక్కువ సమాచారం ఇచ్చి కొత్త కుర్రాళ్లను అయోమయంలో పడేయనని ఈ యార్కర్ కింగ్ అన్నాడు. నా అనుభవం నుంచి నేను సంపాదించిన సమాచారం ఏదైన పనికి వస్తుందంటే కచ్చితంగా అందిస్తానని చెప్పారు.
భూమ్రా గత రెండు సంవత్సరాలుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వెన్నునొప్పికి సర్జరీ చేయించుకోవడంతో 2022 లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాల్గొన లేదు. అయితే 2023లో జరిగిన ప్రపంచకప్ లో మాత్రం పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆ ఈవెంట్‌లో కేవలం 18.65 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. సగటు ఎకానమీ కేవలం 4 గా మాత్రమే ఉంది.
భూమ్రా 74 T20 అంతర్జాతీయ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ అల్ టైమ్ జాబితాలో మూడో స్థానం. స్థిరంగా యార్కర్లను సంధించే విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పేసర్లలో భూమ్రానే నెంబర్ వన్ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
ప్రస్తుతం యార్కర్‌ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రపంచంలోని ఏకైక పేసర్ బుమ్రా అని ఆస్ట్రేలియా గ్రేట్ బ్రెట్ లీ కూడా చెప్పాడు. అయితే దీని వెనక సంవత్సరాల తరబడి కొనసాగించిన ప్రాక్టీస్ ఫలితమేనని బుమ్రా చెప్పుకొచ్చాడు.
" నేను పెద్దయ్యాక టెన్నిస్-బాల్, రబ్బర్-బాల్ క్రికెట్ చాలా ఆడాను. వేసవి క్యాంపులలో నా స్నేహితులతో చాలా ఆడతాను" అని అతను చెప్పాడు.
" వికెట్లు తీయడానికి ఇదొక్కటే మార్గమని నేను భావించాను. ఎందుకంటే నేను ఫాస్ట్ బౌలింగ్‌కి అభిమానిని. నేను టెలివిజన్‌లో చూసిన వాటికి నిజంగా ఆకర్షితుడయ్యాను. అందుకే నేను దానిని పునరావృతం చేయడానికి ప్రయత్నించాను. ఇది (టెన్నిస్) -బాల్ క్రికెట్) ఒక రహస్యం (బౌలింగ్ యార్కర్లకు) లేదా నాకు తెలియదు," అని బుమ్రా ఆశ్చర్యపరిచే సమాధానం చెప్పాడు.
" నేను ఈ డెలివరీని కొనసాగించాను. నేను ఇప్పటికీ దానిని అభ్యసిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీరు అభివృద్ధి చేసే ప్రతి నైపుణ్యాన్ని మీరు సాధన చేయాలి. దానిని బలోపేతం చేయాలి. కాబట్టి రెండింటి కలయిక ఉంటుందన్నారు"
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏలతో పాటు భారత్ గ్రూప్ ఏలో ఉంది. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌పై తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు.


Tags:    

Similar News