ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత గుకేశ్ దొమ్మరాజు

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో గెలుపొందిన గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.;

Update: 2024-12-12 13:45 GMT

భారతదేశానికి చెందిన చెస్ క్రీడాకారుడు గుకేష్ దొమ్మరాజు చరిత్ర సృష్టించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ - 2024 పోటీలో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి, చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. 14వ, చివరి గేమ్‌లో డింగ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ స్థానం సంపాదించారు.

గుకేష్ VS డింగ్ లిరెన్ ..

ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఓపెనింగ్ రౌండ్‌లో ఓటమిని చవిచూశారు. మళ్లీ పుంజుకుని మూడో రౌండ్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. 11వ రౌండ్‌లో ఆధిక్యం సాధించారు. తర్వాతి గేమ్‌లో డింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో గెలుపొందిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.

Tags:    

Similar News