భారత బౌలర్లు ఏదో చేస్తున్నారన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్
భారత బౌలర్ల కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేస్తున్నారని, ఇందుకు వారు ఏదో చేస్తున్నారనే అనుమానాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ లేవనెత్తారు.
By : Praveen Chepyala
Update: 2024-06-27 11:40 GMT
టీ20 ప్రపంచకప్ లో అదరగొడుతున్న భారత్ బౌలర్ల ప్రతిభపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ అనుమానం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ సహ భారత బౌలర్లు రివర్స్ సింగ్ చేయడానికి ఏదో చేశారనే అనుమానాలను ఇంజమామ్ లేవనెత్తాడు.
అయితే వీటిని ‘రబ్బిష్’ అంటూ కెప్టెన్ రోహిత్ కొట్టిపాడేశాడు. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్లో దూసుకెళ్లింది. ముఖ్యంగా ఎడమ చేతి వాటం పేసర్ అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. చివర్లో సంధించిన బంతులన్నీ కూడా రివర్స్ స్వింగ్ అయ్యాయి.
పాకిస్థానీ వార్తా ఛానెల్‌తో ఇంజమామ్ మాట్లాడుతూ, అర్ష్‌దీప్ సహ భారత జట్టు బంతిపై ఏదో పని చేస్తున్నారని ఆరోపించారు, ఈ పని లాంకీ పేసర్ తన రెండవ స్పెల్‌లో రివర్స్ స్వింగ్ రాబట్టడానికి సాయపడింది. "అర్ష్‌దీప్ 15వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, అది రివర్స్ స్వింగ్ అయింది. కొత్త బంతి అంత త్వరగా ఎలా అయింది. 12, 13 ఓవర్ వరకే బంతి ఇందుకు సిద్దంగా కనిపించింది. ఇది 15వ ఓవర్‌లో రివర్స్ స్వింగ్ అయింది. అంపైర్లు కళ్లు తెరవాలి" అని ఇంజమామ్ న్యూస్ ఛానెల్‌తో అన్నారు.
ఇదే విధంగా పాకిస్తాన్ బౌలర్లు చేస్తే ప్రపంచమంతా గోల చేసేదని పాక్ మాజీ కెప్టెన్ అన్నారు. బూమ్రా చేస్తే అది అతని సహజ నైపుణ్యంగా భావించాలని, కానీ ఇతర బౌలర్లు ఇలా చేస్తే తప్పకుండా ఆలోచించాల్సిన విషయమని ఇంజామామ్ వాదన.
ఇదే అంశాన్ని తాజాగా రోహిత్ శర్మ దగ్గర కొంతమంది విలేకరులు ప్రస్తావించారు. దీనిని ఆయన తోసిపుచ్చారు. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టి పడేశారు. బ్యాట్స్ మెన్ ఒపెన్ మైండ్ తో ఉండాలని సూచించారు. "దీని గురించి ఇప్పుడేం చెప్పాలి? ఇంత ఎండలో మీరు ఆడుతున్నారు, వికెట్ పొడిగా ఉంది, బంతి ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతుంది. ఇది మన జట్లే కాదు, అన్ని జట్లకు జరుగుతుంది. అన్ని జట్ల బౌలర్లు రివర్స్ స్వింగ్ కు రాబడుతున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు.
"మీరు ఏ పరిస్థితుల్లో ఆడుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. మ్యాచ్ ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో జరగడం లేదు," అని రోహిత్ అన్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 205 పరుగులు చేసి ఆస్ట్రేలియాను 181/7కి పరిమితం చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఎనిమిది ఓవర్లలో 81 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. కానీ 16, 18వ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఆసీస్ ను ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.