ఏఐ ప్రెడిక్షన్ నిజమైంది.. భారత్ గెలిచింది..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నర్స్ విషయంలో ఏఐ ఫ్లాట్ ఫార్మ్ చేసిన ప్రెడిక్షన్ అక్షర సత్యమంది.;
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నర్స్ విషయంలో ఏఐ ఫ్లాట్ ఫార్మ్ చేసిన ప్రెడిక్షన్ అక్షర సత్యమంది. చాట్‌జీపీటీ, జెమినీ, క్రూక్ అన్నీ కూడా భారత్ గెలవడం ఖాయమని చెప్పింది. అదే విధంగా హోరాహోరీగా సాగిన పోరులో భారత్ ఘనవిజయం సాధించింది. టోర్నీ ప్రారంభం నుంచి ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిల్యాండ్‌తో భారత్ రెండుసార్లు తలపడగా రెండు సార్లూ కివీస్‌ను మట్టికరిపించింది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి రికార్డు చేసినప్పటికీ తన ఆటతీరుతో ఔరా అనిపించింది భారత్.
తొలుగ బౌలింగ్ చేసిన భారత్.. కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయం సాధించింది. ప్రతి బౌలర్ కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంత్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారు. వరున్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా, షమి చెరో వికెట్ తీశారు. కాగా కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) రాణించారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లకు న్యూజిల్యాండ్ 7 వికెట్లో కోల్పోయి 251 పరుగులు చేసింది.
దీంతో 52 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ (1) తీవ్ర నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ (48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (34*), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9*) పరుగులు చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో ఏఐ ఫ్లాట్ ఫార్మ్స్ చేసిన ప్రెడిక్షన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.