పాకిస్తాన్ డిమాండ్లను అంగీకరించిన ఐసీసీ
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ లో షెడ్యూల్?
By : 491
Update: 2024-12-19 13:37 GMT
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్ ట్రోఫి నిర్వహణలో ప్రతిష్టంభన తొలగిపోయింది. పీసీబీ విధించిన షరతులకు ఐసీసీ ఈ అంగీకరించిది. ఈ టోర్నీని హైబ్రీడ్ పద్దతిలోనే నిర్వహించనున్నారు. భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ లోని ఆడనున్నారు.
పాకిస్తాన్ వెళ్లడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బీసీసీఐ కూడా తాము రాలేమంటూ చేతులెత్తేసింది. టీమిండియా లేకుండా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి నిర్వహిస్తే టోర్నీ మొత్తం కళతప్పే అవకాశంతో పాటు, భారీ స్థాయిలో నష్టం వచ్చే అవకాశం ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ తో టోర్నీ నిర్వహించడానికి ఐసీసీ పలుమార్లు పీసీబీతో ఐసీసీ సమావేశం నిర్వహించింది. మొదట ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని పాక్.. చివరకు దిగిరాకతప్పలేదు. అయితే భారత్ లో నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలో కూడా పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికలో నిర్వహించాలని పట్టుబట్టింది.
2027 లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్, 2028 లో పాకిస్తాన్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ కు ఇవే నిబంధనలు వర్తించాలని కోరింది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్, 2026లో భారత్ - శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న T20 ప్రపంచ కప్‌ను కూడా ఈ ఏర్పాటు కవర్ చేస్తుంది.
"ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ త్వరలో నిర్ధారించబడుతుంది" అని ఐసిసి ఓ ప్రకటనలో తెలిపింది. చైర్మన్ గ్రెగ్ బార్క్లే నేతృత్వంలోని బ్యాక్ డోర్ ద్వారా నిర్వహించిన చర్చల తరువాత ఈ విధమైన ప్రకటన వచ్చింది.
బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో కూడా పీసీబీ తన జట్టును పంపిందని, భారత్ మాత్రం మా దేశానికి రాలేదని ఆక్షేపించింది. ఇరుదేశాల మధ్య 2012 లో చివరిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.