ఇంతకంటే మెరుగ్గా ఆడగలను కావచ్చు: సంజూ శాంసన్

బంగ్లాదేశ్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి టీ20లో..

By :  491
Update: 2024-10-13 05:36 GMT

ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో స్థానానికి కనీసం నలుగురుకు తక్కువ కాకుండా పోటీదారులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్ కు రాకరాక అవకాశం వస్తే వాటిని రెండు చేతులతో ఒడిసి పట్టుకోలేకపోయేవాడు. ఇలా ఎన్నో అవకాశాలు.. ప్రతిభ అపారంగా ఉన్నా.. దానికి తగ్గట్లు మైదానంలో ప్రదర్శన లేదు.. అతని మద్ధతుదారులు కూడా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు.

బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో కేవలం ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ ను మాత్రమే చోటు దక్కింది. అప్పుడే అర్థం అయింది. సంజూ మరో ఒపెనర్ గా బరిలోకి దిగుతాడని.. తొలి మ్యాచ్ లో మంచి ప్రారంభం లభించిన ఫినిషింగ్ ఇవ్వలేకపోయాడు. రెండో మ్యాచ్ లో ఫెయిల్.. చివరి మూడో టీ20 హైదరాబాద్ .. ఇక్కడ విఫలమయితే.. పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పనిలేదు. ఇంతకుముందే శ్రీలంక పర్యటనలో రెండు మ్యాచుల్లో డకౌట్ గా వెనుదిరిగాడు.

అలాంటి ఒత్తిడిలో హైదరాబాద్ లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ ఉప్పలో లో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతర్జాతీయ వేదికలపై సరిగా ఆడలేడనే విమర్శలను పటాపంచలు చేస్తూ టీ20 చరిత్రలోనే నాలుగో వేగవంతమైన సెంచరీ చేశాడు. కేవలం 40 బంతుల్లోనే మూడంకెల స్కోరు సాధించాడు. ఇలా తన తొలి శతకాన్నే రికార్డుల పుటల్లో చోటు దక్కెలా చెలరేగాడు. శాంసన్ కేవలం 47 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 11 ఫోర్లతో 111 పరుగులు చేశాడు.

శాంసన్ శతకంతో నిర్ణీత ఓవర్లలో భారత్‌ను 297/6తో రికార్డు స్థాయిలో స్కోర్ ప్రత్యర్థి ముందు నిలిపింది. ఈ ఫార్మాట్‌లో టీమిండియాది అత్యధిక స్కోర్. టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక పరుగులు. ఇంతకుముందు నేపాల్ 314 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉంది.
మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు కార్యక్రమంలో మాట్లాడిన సంజూ.. తాను ఇంతకంటే మెరుగ్గా ఆడగలనని అంగీకరించారు. “నేను బాగా చేశానని వారు (జట్టు సభ్యులు) సంతోషంగా ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అక్కడ ఏమి చేయగలరో తెలుసుకోవడం నిరాశకు గురి చేస్తుంది, నేను చాలా బాగా చేయగలనని కూడా భావించాను,” సంజూ చెలరేగడంతో మూడో  టీ20లో బంగ్లాపై ఏకంగా 133 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
ఈ విజయంతో జట్టు 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ‘‘ ఇంతకుముందు అనేక అవకాశాలు వచ్చాయి. వాటిని నేను సరిగా ఉపయోగించులేకపోయాను. కానీ ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలో నాకు తెలుసు. ఎక్కువగా గేమ్ పైనే దృష్టి పెట్టాను. అందుకే ఇలా’’ అని శాంసన్ చెప్పాడు.
“ దేశం కోసం ఆడుతున్నప్పుడు, ఆ ఒత్తిడి ఉంది, కానీ నేను మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికీ నా ప్రతిభకు తగిన న్యాయం చేయలేకపోయాను. ఈ రోజు నాకు అవకాశం లభించింది, జట్టు నాయకత్వం పూర్తి మద్దతు తనకు లభించింది" అని శాంసన్ చెప్పాడు. జట్టు మేనేజ్మెంట్ ఏమి చేసినా నాకు మద్ధతు ఇస్తామని చెబుతోంది. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చేసి చూపించారు.
గత రెండు సిరీస్ లో నాకు రెండు సార్లు అవకాశం లభించింది. ఏం జరుగుతుందో అని ఇంటికి వెళ్లానని సంజూ తన అంతరంగం ఆవిష్కరించాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన ప్రభావవంతమైన బ్యాటింగ్ ప్రదర్శనలకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు, అతని ఆకట్టుకునే ప్రదర్శనకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లను ప్రశంసించారు.
"స్కిప్పర్, కోచ్ ఇచ్చిన స్వేచ్ఛ మొత్తం సమూహానికి అద్భుతమైనది. రోజు చివరిలో మీరు క్రీడను ఆస్వాదించగలిగితే మీరు మీ నుంచి గరిష్ట ప్రతిభను బయటపెడతారు” అని హర్దిక్ చెప్పాడు. "నిస్వార్థ" బృందాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టినట్లు సూర్యకుమార్ చెప్పారు.
“49 లేదా 99 పరుగులతో సంబంధం లేకుండా జట్టు కంటే ఎవరూ పెద్దవారు కాదని, మైదానం వెలుపల బంతిని కొట్టాలని గౌతీ భాయ్ (గౌతమ్ గంభీర్) సిరీస్‌కు ముందు చెప్పాడు. సంజూ చేసింది అదే” అని సూర్యకుమార్‌ అన్నారు. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉందని అతి తక్కువ ఫార్మాట్‌లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ అన్నాడు. “ఆరోగ్యకరమైన పోటీ మంచి ఒత్తిడి. నేను ఒత్తిడిలో లేను కానీ ఈ రాత్రి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు, ”అని అతను చెప్పాడు.
ఓడిపోయిన కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మాట్లాడుతూ బంగ్లాదేశ్ మెరుగుపడాలంటే స్వదేశంలో ఆడుతున్న పిచ్‌లను తప్పనిసరిగా మార్చాలన్నాడు. “మేము ఏ జట్టుతోనైనా పోటీపడగలమని మనపై నమ్మకం ఉండాలి. మన ఇంటి వికెట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లు బాధ్యతలు తీసుకోవాలి' అని శాంటో చెప్పాడు.


Tags:    

Similar News