రసపట్టులో బాక్సింగ్ డే టెస్ట్.. పెవిలియన్ చేరిన లబుషేన్, స్టార్క్

క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ కమిన్స్..

Update: 2024-12-29 05:42 GMT

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. టీ విరామం తరువాత ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ ను హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపగా, మిచెల్ స్టార్క్ ను పంత్ రనౌట్ చేశాడు.

ప్రస్తుతం ఆసీస్ 156 పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కంగారుల ఆధిక్యం 262 పరుగులుగా ఉంది. భారత్ తన మొదటి ఇన్సింగ్స్ లో 369 పరుగులకి ఆలౌట్ అయింది. దాంతో ప్రత్యర్థికి 105 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కమిన్స్ (38) తోడుగా స్పిన్నర్ నాథన్ లియాన్ తోడుగా ఉన్నారు.

తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ప్రారంభంలోనే యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఇన్సింగ్స్ సాఫిగా సాగుతున్న తరుణంలో సిరాజ్ మొదటి ఇన్సింగ్స్ సెంచరీ హీరో స్మిత్ ను పెవిలియన్ పంపాడు. తరువాత బుమ్రా బౌలింగ్ కు దిగి ఒకే ఓవర్ లో హెడ్, ఫామ్ లో లేని మార్ష్ ను వెనక్కి పంపాడు.
తరువాత కీపర్ అలెక్స్ కేరీని క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మార్ష్ వికెట్ తో బుమ్రా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 44 టెస్టుల్లోనే ఈ ఏస్ బౌలర్ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఈ వికెట్లన్నీ 19.56 సగటుతోనే సాధించాడు. ప్రపంచంలో ఏ బౌలర్ కు ఇది సాధ్యం కాలేదు.
ఇమ్మాక్యులేట్ లెంగ్త్, ఇబ్బందికరమైన బౌన్స్, లేట్ మూవ్‌మెంట్‌తో, బుమ్రా ఆస్ట్రేలియన్ లైనప్‌ను పూర్తిగా చిక్కుల్లో పడేశాడు. 2018-19 సిరీస్‌లో షాన్ మార్ష్ టెస్ట్ కెరీర్‌ను బుమ్రా ముగించినట్లే, ఈసారి అతని తమ్ముడు మిచెల్ మార్ష్ (0) స్టార్ ఇండియన్ పేసర్ ధాటిగా సమాధానమే లేదు.
బాక్సింగ్ డే టెస్టుల్లో మిగిలిన బౌలర్ల నుంచి బుమ్రాకు మంచి మద్ధతు లభించింది. ముఖ్యంగా ఆకాశ్ దీప్ కు కొత్త బంతి ఇవ్వడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్లపై ఒత్తిడి పెరిగింది. కట్టుదిట్టంగా బంతులు సంధించడంతో కంగారులు అనేక సార్లు బంతిని మిస్ అయ్యారు. మరో ఎండ్ లో బౌలింగ్ కు దిగిన సిరాజ్ కీలకమైన కీలక వికెట్లు తీసి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.


Tags:    

Similar News