మరోసారి కుప్పకూలిన టీమిండియా... ఆరు వికెట్లతో చెలరేగిన స్టార్క్

ఆసీస్ తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న డై అండ్ నైట్ టెస్ట్ లో భారత్ మరో సారి కష్టాల్లో చిక్కుకుంది. పింక్ బాల్ తో జరిగుతున్న ఈ మ్యాచ్ లో..

By :  491
Update: 2024-12-06 10:16 GMT

బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా మరోసారి కుప్పకూలింది. పింక్ బాల్ తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో 44.1 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు.

టాస్ గెలిచి మ్యాచ్ ప్రారంభించిన భారత్ కు తొలి బంతికే షాక్ తగిలింది. పెర్త్ లో సెంచరీతో చెలరేగిన యశస్వీ జైశ్వాల్ తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే మరో ఒపెనర్ కేఎల్ రాహుల్ తో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గిల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఇద్దరి మధ్య హఫ్ సెంచరీ భాగస్వామ్యం తరువాత మరోసారి బౌలింగ్ కు దిగిన స్టార్క్ వరుస ఓవర్లలో రాహుల్, విరాట్ ను వెనక్కి పంపాడు. అనూహ్యంగా వచ్చిన బౌన్స్ తో ఇద్దరు గల్లీ, స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. మధ్య బోలాండ్ గిల్, కెప్టెన్ రోహిత్ ను ఎల్బీగా వెనక్కి పంపించాడు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తెలుగు కుర్రాడు, యంగ్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి టీమిండియా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతను మూడు చక్కనైన సిక్స్ లు, మరో మూడు బౌండరీలతో 42 పరుగులు సాధించాడు.
అనంతరం మొదటి ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 12 ఓవర్లలో 32 పరుగులు సాధించి ఖవాజ వికెట్ కోల్పోయింది. బూమ్రా ఈ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వికెట్ తో 2024 లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.


Tags:    

Similar News