దేశానికి రాబోయే ముప్పును ఎలా ఎదుర్కోవాలని సోనియా గాంధీ చెప్పారు?

థియోక్రటిక్ కార్పొరేట్ రాజ్యం అంటే ఏంటీ?;

Update: 2025-08-10 09:31 GMT
సోనియా గాంధీ

ప్రస్తుత రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ‘థియోక్రటిక్ కార్పొరేట్ రాజ్యం’గా మార్చడంలో ఆర్ఎస్ఎస్/ బీజేపీ విజయం సాధించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కు తగిన సైద్దాంతిక వైఖరిని రూపొందించడంలో సోనియా గాంధీ విజయం సాధించారు.

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్ లో జరిగిన ‘రాజ్యాంగ సవాళ్లు- దృక్ఫథాలు,మార్గాలు’ అనే అంశంపై పార్టీ జాతీయ న్యాయ సమావేశంలో ఆమె వ్రాతపూర్వక సందేశంలో దీనిని నాయకులతో పంచుకున్నారు.

బీజేపీ రాజ్యాంగాన్ని ముట్టడిస్తోందని, తనను వ్యతిరేకిస్తున్న వ్యవస్థలను కూల్చివేయడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తోందని ఆమె అన్నారు.

భారత ప్రజాస్వామ్యం కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు సేవ చేయడానికి బీజేపీ- ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక తిరుగుబాటుకు కుట్రపన్నిందని సోనియా గాంధీ ఆరోపించారు.

వేదికపై కనిపిస్తున్న గాంధీ, నెహ్రూ, పటేట్, అంబేడ్కర్


 కాంగ్రెస్ అధికార పగ్గాలు..

ఆర్ఎస్ఎస్/ బీజేపీ ఎజెండా గురించి ఈ రకమైన తీవ్రమైన రాజకీయ ఆర్థిక సూత్రీకరణను గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడూ చేయలేదు. ఆర్ఎస్ఎస్ సామాజిక- రాజకీయ, ఆర్థిక సిద్దాంతాలతో పోరాటమే కాకుండా కొత్త సైద్దాంతిక ఆలోచనలను రూపొందించే బాధ్యతను కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు అప్పగించారు.
ఆర్ఎస్ఎస్/ బీజేపీ అమలు చేస్తున్న కుల ఆధ్యాత్మిక సిద్దాంతాన్ని బహిర్గతం చేయగల సృజనాత్మక రాజకీయ, ఆర్ధిక సిద్దాంతాలను రూపొందించే స్థితిలో కమ్యూనిస్టులు లేరు.
వారు ఇంకా కుల సిద్దాంతంతో పోరాటం చేయలేరు. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అవి సైద్దాంతిక, రాజకీయ పోరాటాలకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉపయోగకరమైన భావనలను రూపొందించలేవు.
రాహుల్ గాంధీ దేశంలో శక్తివంతమైన సామాజిక- రాజకీయ సంస్కర్తగా ఎజెండా నిర్ణయించే నాయకుడిగా ఎదిగిన తరువాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్/ బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కులాన్ని ముందుకు తీసుకురావడం..
కులగణన, అంబేడ్కర్ భావజాలం, సర్థార్ వల్లభాయ్ పటేల్ ను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడం, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్న ఆర్ఎస్ఎస్ పురాతన గ్రంథమైన మను ధర్మ శాస్త్రంపై బహిరంగంగా దాడి చేయడం పూర్తిగా కొత్త విషయం.
గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, పటేల్ ఫొటోలను సమావేశం జరుగుతున్న వేదికపై స్పష్టంగా కనిపించేలా పెట్టడం సైద్దాంతిక వ్యూహంలో పెద్ద మార్పుకు సూచన. దీనికి తోడు లౌకికవాదం, సోషలిజం అనే పదాలను ప్రవేశిక నుంచి తొలగించాలనే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదన సందర్భంలో సోనియా గాంధీ తొలిసారిగా అంబేడ్కర్ ను రాజ్యాంగ నిర్మాతగా అంగీకరించారు.
నినాదాలతో ముందుకు..
కాంగ్రెస్ లో ఉంటూ రాహుల్ ప్రస్తావించిన కుల గణనపై సందేహం ఉన్నవారికి ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదం ఇప్పుడు గుర్తుకు రావచ్చు. రాహుల్ కుల గణన ప్రచారం ఇప్పటికే పార్టీలో సందేహాస్పద థామస్ లను ఆకర్షించింది.
కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణనకు పచ్చజెండా ఊపింది కాబట్టి వారు కూడా ఈ అంశంపై ముందుకు రావచ్చు. శశిథరూర్ తరహ వంటి నాయకులు భవిష్యత్ లో నైతిక పతనం దిశగా సాగుతారు.
అలాంటి నాయకుడిని బీజేపీ ఉపయోగించుకుని బయటకు విసిరేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్న వ్యక్తిగా సోనియా నిరూపించుకున్నారు.
‘‘ఇప్పుడు వారు అంబేడ్కర్ తీసుకొచ్చిన సమాన పౌరసత్వం అనే దృక్ఫథానికి మూల స్తంభాలుగా ఉన్న సోషలిజం, లౌకికవాదాన్ని తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది మన ప్రజాస్వామ్య గణతంత్య్రం కేవలం కొద్దిమందికి మాత్రమే సేవ చేసే కార్పొరేట్ శక్తులతో నింపివేయడానికి చేసే తిరుగుబాటు. ఇది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చేసే ద్రోహం’’ అని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.
దైవ పరిపాలన.. కార్పొరేట్ దేశం..
దైవ పరిపాలన, కార్పొరేట్ రాజ్య స్థాపనలో ఉన్న ప్రధాన సమస్య దేశంలోని శూద్ర, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల భవిష్యత్ తో ముడిపడి ఉంది. చారిత్రాత్మకంగా మనుధర్మం అనేది వర్ణధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది.
దీనిలో ద్విజ కులాలకు అన్ని రంగాలకు ఆధిపత్యం కల్పించింది. ఆర్ఎస్ఎస్ చాలాకాలం పాటు బ్రాహ్మణ- బనియా సంస్థగా పిలవబడినప్పటకీ నరేంద్ర మోదీ- అమిత్ షా పాలనలో అది బనియా- బ్రాహ్మణ గుత్తాధిపత్య నెట్ వర్క్ గా మారిపోయింది. బనియాలు అనేక రంగాలపై గుత్తాధిపత్యం వహించారు. మూలధనంపై నియంత్రణ సాధించారు.
మోదీ ఓబీసీ నేపథ్యం ఒక ముసుగు వంటిది. 11 సంవత్సరాల మోదీ- షా పాలన తరువాత వ్యవసాయ, చేతి వృత్తుల ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్ వారిని అనుమతించిన విధానం, భారీ ప్రైవేటీకరణ ప్రక్రియతో కుల నియంత్రణ గుత్తాధిపత్యానికి సూచిక. శుద్ర రైతులు ఓడించిన మూడు వ్యవసాయ చట్టాలు దానికి సూచిక.
కౌటిల్యుని అర్థశాస్త్ర..
ఆర్ఎస్ఎస్ స్థాపించాలనుకుంటున్న దైవ పరిపాలనా కార్పొరేట్ రాజ్య చట్రం కౌటిల్యుడి అర్థశాస్త్రలో కూడా సైద్దాంతిక పునాదులు కనిపిస్తాయి. ‘‘నాలుగు శూద్ర కులాలు, నాలుగు మతపరమైన జీవిత వర్గాలకు చెందిన ప్రజలు రాజు దండంతో పరిపాలించినప్పుడూ ప్రజలు కూడా వారి మార్గాలనే అనసరిస్తారు.
ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడూ సోనియా గాంధీ తన సందేశంలో మనుధర్మం ద్వారా చట్టబద్దం చేయబడిన కౌటిల్యుడి కేంద్ర సిద్దాంతం గురించి కూడా విశదీకరించారు.
శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసులు ఎవరికి ఆధ్యాత్మిక రంగంలో పూజారులుగా మారే హక్కు లేదు. ధన యజమానిగా మారే హక్కు లేదు. దీనిని ఏకస్వామ్య మార్గంలో గుప్త ధనంగా మార్చారు.
ద్విజుల రాజదండం కింద..
రాష్ట్రం పూర్తిగా ద్విజుల చేతుల్లో ఉంది. దీనిని ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకులు నిరంతరం విశ్వసించారు. సోనియా గాంధీ ఇప్పుడు చెబుతున్న కార్పొరేట్ సంపదను వారు ఎన్నడూ దళితులతో పంచుకోవడానికి ఒప్పుకోరు.
ఆర్ఎస్ఎస్ ప్రపంచ దృక్పథం ప్రకారం.. ఉత్పాదక శక్తులు ఎల్లప్పుడూ ద్విజుల ఆధీనంలో ఉండాలి. వారు ఉత్పత్తిలో పాల్గొనరు. వారు శ్రమ ఫలాలను మాత్రం అనుభవిస్తారు. అవి ఎప్పటికి వారి చేతుల్లోనే ఉంటాయి.
నెహ్రూ మోడల్..
భారత్ ను డెమోక్రటిక్ సోషలిజం భావనగా ఉండేలా నెహ్రూ రూపకల్పన చేశారు. దేశాన్ని అన్ని కులాలకు సంపదను కలిగి ఉండే హక్కు, సంపద సృష్టిలో పాల్గొనే బాధ్యత కలిగిన సంక్షేమ రాజ్యం గా మార్చారు. ఆర్ఎస్ఎస్ ఆయనను భారతీయత లేదని తిరస్కరించింది. నెహ్రును కమ్యూనిస్ట్ రష్యా అనుచరుడిగా ముద్ర వేశారు.
ఊహించని మలుపులో సోనియాగాంధీ సనాతన ధర్మం రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కోసం ఆర్ఎస్ఎస్ అంతర్లీన భవిష్యత్ దృక్ఫథాన్ని బయటపెట్టారు. శూద్రులు, ఓబీసీ, దళితులు, ఆదివాసీలు పూర్తి నియంత్రణలో ఉండే దైవ పరిపాలన కార్పొరేట్ రాష్ట్రం.
ఆమె వ్యాఖ్యలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కార్పోరేట్ ప్రెస్ లో ఎక్కువ భాగం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. సోనియా గాంధీ సైద్దాంతిక భాషలో అరుదుగా మాట్లాడుతుందని మనకు తెలుసు.
ఓబీసీ భవిష్యత్ కు ముప్పు..
ఆర్ఎస్ఎస్ శిబిరంలో పనిచేసే ఏ శూద్రుడు, ఓబీసీ, దళితుడు, ఆదివాసీ కూడా తన సొంత పిల్లల భవిష్యత్ పై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే హిందూ దేశం అనే భావన వారి మనస్సులో లోతుగా పాతుకుపోయి కర్మ సిద్దాంతంలా పనిచేస్తుంది. వారు నిరంతరం కుంభమేళాలు, తీర్థయాత్రలు, భక్తి గీతాలు పాడటం ద్వారా ఓదార్పు పొందేలా చేస్తారు.
తీవ్రమైన రాజ్య నిర్వాహకతవారి ప్రపంచ దృష్టి కోణానికి దూరంగా ఉంది. బీజేపీకి చెందినన ఓబీసీ, దళిత, ఆదివాసీ మంత్రులు ప్రతిపక్షాలపై దాడి చేయడంలో బిజీగా ఉన్నారు.
మనుధర్మాన్ని వ్యతిరేకించడానికి కాకుండా వారికి దానిని ముందుకు తీసుకెళ్లడానికే అధికారం ఇవ్వబడిందని తెలుసు. కానీ భవిష్యత్ లో శూద్రులు, ఓబీసీ, దళితులు, ఆదివాసులందరికి ప్రమాదం ఉంది.
హిందూత్వ రాజకీయ ఆర్థిక వ్యవస్థ సిద్దాంతాలను దాని విదేశీ ఆంగ్ల విద్యావంతులైన మేధావులు నిర్మిస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉత్పాదక ప్రజలకు ఆంగ్ల విద్యను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఓబీసీల నుంచి సామాజిక- రాజకీయ ఆలోచనాపరులు అరుదుగా ఉద్భవిస్తారు.
యూరోపియన్ సందర్భం...
యూరోపియన్ సందర్భంలో థియోక్రాటిక్ ఫ్యూడల్ స్టేట్ పాత్రను 16వ శతాబ్ధం ప్రారంభంలో మాకియవెల్లి అర్థం చేసుకున్నాడు. కానీ యూరప్ లో పోస్ట్ మోడరన్ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో థియోక్రాటిక్ కార్పొరేట్ స్టేట్ సిద్ధాంతం చర్చనీయాంశం కాలేదు.
ఎందుకంటే రాష్ట్రం, మతం తీవ్రంగా వేరు చేశారు. ముస్లిం ప్రపంచం ఇప్పటికే దైవపరిపాలనా కార్పొరేట్ రాజ్యంలో నివసిస్తోంది. భారతీయ ముస్లిం ఆలోచనపరులు కూడా దైవపరిపాలన కార్పొరేట్ రాజ్యంతో పోరాడలేరు.
కాంగ్రెస్ పట్ల సానుభూతిపరులైన ద్విజ రాజకీయ ఆర్థికవేత్తలు కూడా సోనియాగాంధీ సూత్రీకరణపై చర్చలోకి ప్రవేశిస్తారో లేదో మాకు కచ్చితంగా తెలియదు.
తెలంగాణ సర్వే కుల ప్రకారం.. లక్షలాది మంది ఆ వర్గంలో ఉన్నారని చూపించినట్లుగా వారు కులం లేదు అనే వర్గానికి చెందినవారని నటించినప్పటికీ ఈ పోరాటంలో కుల ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ సిద్దాంతం కొద్దిమంది మాత్రమే మాట్లాడే అనుభవజ్ఞురాలైన నాయకురాలు సోనియాగాంధీ నుంచి వచ్చింది. కాబట్టి భారత్ లోని విభిన్న భావజాలాలకు చెందిన రాజకీయ ఆర్థిక పండితులు ఈ భావనను ఎలా చర్చించుకుంటారో వేచి చూద్దాం.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)


Tags:    

Similar News